Rohit Sharma: పొట్టి క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్.. కింగ్ కోహ్లీ తర్వాతి స్థానంలోకి..
MI vs SRH, Rohit Sharma: ఐపీఎల్ 16వ సీజన్ ప్లేఆఫ్స్‌లో నిలిచేందుకు ముంబై ఇండియన్స్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అటు భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో, ఇటు ముంబై టీమ్ తరఫున ఐపీఎల్‌లో అరుదైన..
MI vs SRH, Rohit Sharma: ఐపీఎల్ 16వ సీజన్ ప్లేఆఫ్స్‌లో నిలిచేందుకు ముంబై ఇండియన్స్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అటు భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో, ఇటు ముంబై టీమ్ తరఫున ఐపీఎల్‌లో అరుదైన ఘనతను సాధించాడు. రెండు ఘనతల్లోనూ విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో రెండో ఆటగాడిగా నిలిచాడు. నేటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్(56) 41 పరుగుల వద్ద టీ20 క్రికెట్‌లో 11000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో 11000 పరుగుల మార్క్ దాటిన రెండో ఆటగాడిగా అవతరించాడు. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ ఈ మార్క్‌ని అందుకున్నాడు. కోహ్లీ ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో 11, 864 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో 11 వేల పరుగులు చేసిన 7వ ఆటగాడిగా కూడా హిట్ మ్యాన్ నిలిచాడు.
ఇదే కాక రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీమ్ తరఫున కూడా ఓ ఘనత సాధించాడు. అదేమిటంటే.. ఐపీఎల్‌లో ఒకే టీమ్ తరఫున 5 వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కూడా కింగ్ కోహ్లీ తర్వాత స్ధానంలో రోహిత్ శర్మ నిలిచాడు. ఐపీఎల్ 4వ సీజన్(2011) నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న హిట్‌మ్యాన్ ఆ టీమ్ తరఫున ఇప్పటివరకు 5021 పరుగులు చేశాడు. నేటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన 35 పరుగుల వద్ద ఈ మార్క్‌ని అందుకున్నాడు. తద్వారా ముంబై ఇండియన్స్ టీమ్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు ఇక్కడ విశేషమేమిటంటే.. ఒకే టీమ్ తరఫున 5000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీనే ఉన్నాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకే ఆడుతున్న కోహ్లీ ఆ టీమ్ తరఫునే ఇప్పటివరకు 7162 పరుగులు చేశాడు.
కాగా, నేటి మ్యాచ్‌లో SRH టీమ్‌పై ముంబై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ముంబై తరఫున కామెరూన్ గ్రీన్(100) అజేయమైన సెంచరీ, రోహిత్ శర్మ(56) హాఫ్ సెంచరీతో రాణించారు. చివర్లో సూర్య కుమార్ యాదవ్(25, నాటౌట్) టీమ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఆరెంజ్ ఆర్మీ తరఫున ఓపెనర్లు వివ్రాంత్ శర్మ(69), మయాంక్ అగర్వాల్(83) ధీటుగా ఆడారు. వన్‌డౌన్‌లో వచ్చిన హెన్రిచ్ క్లాసెన్(18), చివర్లో మార్క్రమ్(13, నాటౌట్) కొంతమేర రాణించారు. ఇక ముంబై బైలర్లలో ఆకాశ్ మధ్వాల్ 4 వికెట్లు, క్రిస్ జోర్డాన్ 1 వికెట్ తీసుకున్నారు.