KKR vs LSG: 4 ఫోర్లు, 5 సిక్సర్లు, 58 పరుగులు.. కోల్‌కతా బౌలర్లను విధ్వంసం చేసిన నికోలసర్ పూరన్..

KKR vs LSG: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా జరుగుతున్న 68 మ్యాచ్‌లో నికోలస్ పూరన్ మరోసారి చెలరేగాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పూరన్ 30 బంతుల్లోనే 50 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. వీటిలో 4 ఫోర్లు, 5 సిక్సర్లు కూడా ఉన్నాయి. పూరన్ కంటే ముందు వచ్చిన టాపార్డర్..

KKR vs LSG: 4 ఫోర్లు, 5 సిక్సర్లు, 58 పరుగులు.. కోల్‌కతా బౌలర్లను విధ్వంసం చేసిన నికోలసర్ పూరన్..
Nicholas Pooran; Kkr Vs Lsg
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 20, 2023 | 10:18 PM

KKR vs LSG: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా జరుగుతున్న 68 మ్యాచ్‌లో నికోలస్ పూరన్ మరోసారి చెలరేగాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పూరన్ 30 బంతుల్లోనే 58 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. వీటిలో 4 ఫోర్లు, 5 సిక్సర్లు కూడా ఉన్నాయి. పూరన్ కంటే ముందు వచ్చిన టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైనప్పటికీ అతను నిలకడగా రాణించడంతో.. లక్నో సూపర్ జెయింట్స్ పర్వాలేదనిపించే స్కోరును చేరుకోగలిగింది. పూరన్‌తో పాటు తోడుగా నిలబడిన ఆయుష్ బదోని(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) కూడా పర్వాలేదనిపించాడు. దీంతో టీమ్ స్కోర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగుల మార్క్‌ను చేరుకోగలిగింది. ఇక కోల్‌కతా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా తలో రెండేసి వికెట్లు తీసుకోగా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ పడగొట్టారు.

అంతకముందు టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్‌కి దిగింది. ఓపెనర్లలో కరన్ శర్మ(3) పరుగులకే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్‌(28)తో కలిసి ప్రేరక్ మన్కడ్‌(26) కొంతమేర రాణించారు. ఈ ఇద్దరి తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్(0), కృనాల్ పాండ్యా(9) విఫలమైనా సమయంలో నికోలస్ పూరన్ లక్నో టీమ్‌కి అండగా నిలిచాడు. ఎదుర్కొన్న తొలి 4 బంతుల్లోనే 2 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అదే రీతిని కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఆయుష్ బదోని కూడా మెరుగ్గా ఆడాడు. అయితే  ఈ ఇద్దరు కూడా 3 బంతుల తేడాతోనే పెవిలియన్ చేరారు. ఇక చివర్లో వచ్చిన కృష్ణప్ప గౌతమ్(11) పరుగులు చేశాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన కోల్‌కతా టీమ్ తన 6 ఓవర్ల ఆట ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. టీమ్‌కి శుభారంభం అందించిన ఓపెనింగ్ జోడి 61 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే ఈ జోడిలోని వెంకటేష్ అయ్యర్(24) పరుగులకే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో జేసన్ రాయ్(36), నితీష్ రాణా(0) ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..