AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ఒక్క పరుగు తేడాతో కోల్‌కతాపై విజయం సాధించిన లక్నో సూప‌ర్ జెయింట్స్

ఐపీఎల్‌ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అద‌ర‌గొట్టింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఒక్క ప‌రుగు తేడాతో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్‌కు దూసుకుపోయింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.

IPL 2023: ఒక్క పరుగు తేడాతో కోల్‌కతాపై విజయం సాధించిన లక్నో సూప‌ర్ జెయింట్స్
Lucknow Team
Aravind B
|

Updated on: May 21, 2023 | 12:25 AM

Share

ఐపీఎల్‌ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అద‌ర‌గొట్టింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఒక్క ప‌రుగు తేడాతో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్‌కు దూసుకుపోయింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (45; 28 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), వెంకటేశ్‌ అయ్యర్ (24; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం ఇవ్వడంతో కోల్‌కతా సునాయసంగా విజయం సాధించేలా కనిపించింది.

కానీ లక్నో బౌలర్లు మాత్రం అనుహ్యంగా పుంజుకుని వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌పై పట్టు సాధించారు. చివర్లో రింకు సింగ్ (67*; 33 బంతులలో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) గట్టిగా పోరాడినప్పటికీ జట్టును విజయం అందించలేకపోయాడు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌, శార్దూల్ ఠాకూర్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. కృనాల్‌ పాండ్య, గౌతమ్‌ చెరో వికెట్‌ తీశారు.

అయితే మొదటగా బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (28; 27 బంతుల్లో), ప్రేరక్ మన్కడ్ (26; 20 బంతుల్లో), ఆయుష్‌ బదోని (25; 21 బంతుల్లో) పరుగులు చేయగా.. చివర్లో నికోలస్ పూరన్ (58; 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అదరగొట్టాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్, వైభవ్‌ అరోరా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్