AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MSDhoni: ‘ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మ’.. ధోనిని చూసేందుకు ఎగబడిన ఢిల్లీ వాసులు.. బస్సును ఆపి మరీ..

ఊరు మారినా ధోని క్రేజ్‌ మాత్రం మారడం లేదు. చెన్నై, కోల్‌కతా, జైపూర్‌, లక్నో, ఢిల్లీ.. ప్లేస్‌ ఏదైనా మిస్టర్‌ కూల్‌ ఫీవర్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. అదే జనం.. అదే అభిమానం. ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి ధోనిపై అంతులేని అభిమానం చూపిస్తున్నారు ఫ్యాన్స్‌.

MSDhoni: 'ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మ'.. ధోనిని చూసేందుకు ఎగబడిన ఢిల్లీ వాసులు.. బస్సును ఆపి మరీ..
Ms Dhoni
Basha Shek
|

Updated on: May 21, 2023 | 7:56 AM

Share

ఊరు మారినా ధోని క్రేజ్‌ మాత్రం మారడం లేదు. చెన్నై, కోల్‌కతా, జైపూర్‌, లక్నో, ఢిల్లీ.. ప్లేస్‌ ఏదైనా మిస్టర్‌ కూల్‌ ఫీవర్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. అదే జనం.. అదే అభిమానం. ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి ధోనిపై అంతులేని అభిమానం చూపిస్తున్నారు ఫ్యాన్స్‌. గతంలో కేవలం చెన్నైలోనే ధోని ఫీవర్‌ పీక్స్‌లో ఉండేది. కానీ ఇప్పుడు స్టేడియం ఏదైనా ‘ధోని.. ధోని’ అంటూ నినాదాలు మార్మోగుతూనే ఉన్నాయి. తాజాగా చెన్నై సారథిని చూసేందుకు ఢిల్లీ వాసులు పోటెత్తారు. శనివారం (మే20) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్‌ ప్రారంభానికి ముందు స్టేడియానికి వస్తున్న వీధులన్నీ జనసంద్రంతో నిండిపోయాయి. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బస్సులో ఎంఎస్‌ ధోని ఉండడమే. సీఎస్‌కే జెర్సీలు ధరించిన అభిమానులు స్టేడియానికి వెళ్లే దారి పొడవునా మోహరించారు. ధోనిని చూడడం కోసం బస్సును చుట్టుముట్టారు. కొందరైతే కార్ల బానెట్లపై నిలబడి మరీ తమ అభిమాన ఆటగాడిని చూడాలని తపించారు. ఒకానొక దశలో వేలాది మంది రావడంతో ధోని ప్రయానిస్తున్న బస్సు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కాసేపు ఉత్కంఠ నెలకొంది. అయితే కొద్ది సేపటికి పరిస్థితి సద్దుమణగడంతో బస్సుకు దారి దొరికింది.

ఢిల్లీ వీధుల్లో ధోని క్రేజ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు ‘ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్‌ ఉంటారమ్మ’ అంటూ సర్కార్‌ వారి పాట సినిమాలో మహేష్‌ బాబు చెప్పిన డైలాగ్‌ను గుర్తు చేస్తున్నారు. ‘ ఒక వ్యక్తికి ఇంత ఫాలోయింగ్‌ ఉంటుందా.. ఆకాశమంత అభిమానం అంటే ఇదేనేమో’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సీఎస్‌కే కూడా బస్సును చుట్టుముట్టిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. ‘ఒక్కడి కోసం రాజధాని నగరం జనసంద్రమైంది. ఈ దృశ్యం చూడడానికి మా కళ్లు చాలడం లేదు’ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై 77 పరుగుల తేడాతో ఢిల్లీపై ఘన విజయం సాధించింది. . ప్రస్తుతం సీఎస్‌కే 15 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

సీఎస్కే బస్సును చుట్టుముట్టిన ఫ్యాన్స్.. వీడియో..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..
ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన