AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ‘ఆర్‌సీబీ’ కీలక పోరులో ముందుగా గుజరాత్‌దే బౌలింగ్.. గెలిస్తేనే కోహ్లీ టీమ్‌కి ప్లేఆఫ్స్.. మరోవైపు వరుణుడి భయం..

RCB vs GT: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మరి కొద్ది నిముషాల్లో మ్యాచ్ జరగబోతోంది. బెంగళూరు చినస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు..

IPL 2023: ‘ఆర్‌సీబీ’ కీలక పోరులో ముందుగా గుజరాత్‌దే బౌలింగ్.. గెలిస్తేనే కోహ్లీ టీమ్‌కి ప్లేఆఫ్స్.. మరోవైపు వరుణుడి భయం..
Rcb Vs Gt
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 21, 2023 | 8:13 PM

Share

RCB vs GT: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మరి కొద్ది నిముషాల్లో మ్యాచ్ జరగబోతోంది. బెంగళూరు చినస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు టీమ్ తమ సొంత గ్రౌండ్‌లో తొలుత బ్యాటింగ్ చేయనుంది. మరోవైపు బెంగళూరులో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షం నేటి మ్యాచ్‌కి అడ్డుపడే అవకాశం ఉంది. ఇంకా ఇప్పటికే మ్యాచ్ స్టార్ట్ అవ్వాల్సి ఉన్నప్పటికీ వర్షం కారణంగా కొంత ఆలస్యంగా ప్రారంభమవనుంది.

కాగా, ఈ రెండు జట్లకు కూడా ఇదే ఈ సీజన్‌లో చివరి గ్రూప్ మ్యాచ్. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్ 9 విజయాలతో నేరుగా ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. అలాగే ఆడిన 12 మ్యాచ్‌లలో 7 గెలిచిన ఆర్‌సీబీ నేటి మ్యాచ్ ‌గెలిస్తే ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశిస్తుంది. ఒక వేళ ఆర్‌‌సీబీ ఈ టీమ్‌లో వెనకడుగు వేస్తే.. 16 పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఇప్పటికే 14 పాయింట్లతో ఉన్న ఆర్‌సీబీకి మరో పాయింట్ పెరుగుతుంది. అప్పుడు కూడా ముంబై టీమ్ ప్లేఆఫ్స్‌ ఆడుతుంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌సీబీ టీమ్‌కి ఇది తప్పనిసరిగా గెలవాల్సిన కీలక మ్యాచ్.

తుది జట్టు వివరాలు:

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(w), హార్దిక్ పాండ్యా(c), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, యశ్ దయాల్

ఇవి కూడా చదవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ (w), హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..