Tollywood Music Director: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత..
టాలీవుడ్‌లో మళ్లీ విషాదం అవరించింది. కొద్ది సమయం క్రితమే ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన ‘రాజ్-కోటి’ ద్వయంలో..
టాలీవుడ్‌లో మళ్లీ విషాదం అవరించింది. కొద్ది సమయం క్రితమే ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన ‘రాజ్-కోటి’ ద్వయంలో రాజ్ కూడా ఒకరు. ఆయన పూర్తి పేరు తోటకూర సోమరాజు కాగా రాజ్ కోటిగా టాలీవుడ్‌లో ఫేమస్ అయ్యారు. ఇక రాజ్ మరణ వార్త తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టేసింది.
సంగీత దర్శకుడు ‘రాజ్ – కోటి’లో రాజ్ కొద్దిసేపటి క్రితం మరణించారు pic.twitter.com/IavlZO89lm
ఇవి కూడా చదవండి— Suresh Kondeti (@santoshamsuresh) May 21, 2023
మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ స్వయంగా అలనాటి సంగీత దర్శకుడు టీవీరాజు కుమారుడు. ఇక రాజ్-కోటి ద్వయం కలిసి 180కి పైగా సినిమాలకు సంగీతం అందించారు. ప్రళయ గర్జన(1983) సినిమా వీరిద్దరూ కలిసి పనిచేసిన మొదటి చిత్రం. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో ఉదయం, లేడీ జేమ్స్‌బాండ్, ఉక్కు సంకెళ్లు, పున్నమి రాత్రి, మధన గోపాళుడు, యముడికి మొగుడు, ఖైదీ నెం.786, రౌడీ నెం. 1, త్రినేత్రుడు, విక్కీ దాదా, కొదమ సింహం, కొండవీటి రౌడీ, హల్లో బ్రదర్స్ వంటి సినిమాలు కూడా ఉన్నాయి.హల్లో బ్రదర్స్ సినిమాకి రాజ్-కోటి ద్వయం బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నంది అవార్డు కూడా అందుకున్నారు. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వారి మధ్య విభేదాలు తలెత్తాయి. తర్వాత వీరిద్దరూ విడిపోయి ఎవరికి వారు విడివిడిగా సినిమాలు చేశారు. అలా రాజ్ సొంతంగా 10 సినిమాలకు మ్యూజిక్ అందించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..