AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: యాటిట్యూడ్ కాదు, క్యాటిట్యూడ్..! ఓనర్‌‌ని ఆడేసుకుంటోన్న పెంపుడు పిల్లి.. వీడియో చూస్తే అయోమయంలో పడిపోవాల్సిందే..

Trending Video: పెంపుడు జంతువులుగా పెంచుకునేవాటిలో కుక్కలు, పిల్లులు ప్రధానమైనవి. ఇక వీటిలో పిల్లులు చాలా గమ్మత్తైనవి. ఎందుకంటే సాధారణంగా పెంపుడు కుక్కలను ఆడించాలంటే వాటి కోసం కనీసం బంతి అయినా అవసరం. కానీ పిల్లులకు ఆ అవసరం కూడా ..

Watch Video: యాటిట్యూడ్ కాదు, క్యాటిట్యూడ్..! ఓనర్‌‌ని ఆడేసుకుంటోన్న పెంపుడు పిల్లి.. వీడియో చూస్తే అయోమయంలో పడిపోవాల్సిందే..
Cat Funny Visuals
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 21, 2023 | 4:31 PM

Share

Trending Video: పెంపుడు జంతువులుగా పెంచుకునేవాటిలో కుక్కలు, పిల్లులు ప్రధానమైనవి. ఇక వీటిలో పిల్లులు చాలా గమ్మత్తైనవి. ఎందుకంటే సాధారణంగా పెంపుడు కుక్కలను ఆడించాలంటే వాటి కోసం కనీసం బంతి అయినా అవసరం. కానీ పిల్లులకు ఆ అవసరం కూడా లేదు. వాటిని కాగితం, పొడి ఆకులు, లేదా తాడు ముక్కతో అయినా తేలికగా ఆడించొచ్చు. అవీ కాకపోతే నీడతోనే పిల్లులు ఓ ఆట ఆడేస్తాయి. ఈ విషయం పెట్ లవర్స్ అందరికీ బాగా తెలిసిన విషయమే. ఇక పిల్లి ముందు తాడు, లేదా ఎగురుతున్న ఆకు కనిపించేలా చేస్తే వెంటనే వాటిని పట్టేసుకోవాలనే పట్టుదలతో తాడు, ఆకుల మీదకు దూకుతాయి. అయితే అది పిల్లులను ఆడించడానికి మనం చేసే పనులు. కానీ నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. అది పూర్తిగా ఇందుకు విరుద్ధంగా ఉంది.

సర్వసాధారణంగానే పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలో నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ పిల్లి తన యజమానితో ఆడుతోంది. అవును, పిల్లుల ముందు తాడు, కర్ర వంటివి పెడితే వాటిని పట్టుకునేందుకు అవి ప్రయత్నించాలి. అయితే ఈ వీడియోలోని పిల్లి మాత్రం.. అదే తన యజమాని ముందు ఓ తీగ లాంటి వస్తువును పట్టుకో అన్నట్లుగా పెడుతోంది. దాన్ని తన యజమాని పట్టుకునే లోపులోనే మళ్లీ పక్కకు లాగి, తిరిగి తన యజమాని కంటి ముందుకు తీసుకువచ్చి చూపుతోంది. అందుకు సంబంధించిన సన్నివేశాన్ని వీడియో తీసిన సదరు యజమాని దాన్ని నెట్టింట పోస్ట్ చేయడంతో .. అది కాస్త వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Instapawz Pets (@lnstapawz)

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అత్యుత్సాహంతో స్పందించారు. ‘ఏదో ఒక రోజు ఈ పిల్లులు మానవ ప్రపంచాన్ని శాసిస్తాయి’ అంటూ సరదాగా రాసుకొచ్చారు ఓ నెటిజన్. ‘అసలు ఇక్కడ నిజమైన పిల్లి ఎవరు, నాకైతే అయోమయంగా, అర్థం కాకుండా ఉంది’ అని మరొకరు ఆశ్చర్యంగా అడిగారు. ‘మీ పిల్లి రోజూ ఇలాగే ఆడుకుంటుందా’ అని ఇంకొకరు అడిగారు. ఏప్రిల్ 25న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 18 లక్షల మంది చూశారు. అలాగే సుమారు 1 లక్షా 23 వేల మంది దీన్ని లైక్ చేశారు. మరి ఈ వీడియోను చూసిన మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి..

మరిన్ని ట్రేండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..