Amitabh Bachchan : ఫ్యాన్స్ కోసం బిగ్ బీ రిస్క్.. బెదిరింపులను సైతం పక్కన పెట్టి.. బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్..
ముంబైలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు, కాల్పుల కలకలం నేపథ్యంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం జల్సా వద్ద మునుపెన్నడూ లేని విధంగా భద్రతను పెంచారు. ప్రాణాపాయ హెచ్చరికలు ఉన్నప్పటికీ తనను చూడటానికి వచ్చిన వేలాది మంది అభిమానులను నిరాశపరచడం ఇష్టం లేక.. పారదర్శకమైన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ షీల్డ్ వెనుక నుంచే బిగ్ బీ 'ఆదివారం దర్శనం' ఇచ్చారు. పక్కనే కుమారుడు అభిషేక్ బచ్చన్ రక్షణగా నిలిచారు. అభిమానుల పట్ల అమితాబ్ చూపిన ఈ నిబద్ధత అందరినీ కదిలిస్తోంది.

బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, వరుస బెదిరింపులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల బీటౌన్ హీరో టైగర్ ష్రఫ్ పై కొందరు యువకులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో హీరో స్వల్పంగా గాయపడ్డారు. ఇక ఇప్పటికీ సల్మాన్ ఖాన్ తోపాటు స్టార్ హీరోస్ అందరికి గ్యాంగ్‌స్టర్ల నుంచి వస్తున్న హెచ్చరికలు, సంచలన కాల్పుల ఘటనల నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ తారలు మునుపెన్నడూ లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ సినీ దిగ్గజం, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయం నడుమ కనిపించడం ప్రస్తుతం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ముంబైలోని అమితాబ్ ప్రసిద్ధ నివాసం ‘జల్సా’ వెలుపల ప్రతి ఆదివారం సాయంత్రం ఒక ప్రత్యేక సీన్ కనిపించింది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
దేశ నలుమూలల నుంచి తరలివచ్చే వేలాది మంది అభిమానులకు గేటు దగ్గరకు వచ్చి స్వయంగా అభివాదం చేయడం బిగ్ బీకి దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. అభిమానులు సైతం తమ అభిమాన హీరో కోసం ఎంతో ప్రేమగా వస్తుంటారు. అయితే ఇటీవల జుహూ ప్రాంతంలో నటుడు టైగర్ ష్రాఫ్ వాహనంపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరపడం, అమితాబ్ నివాసానికి బాంబు బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు భద్రతను అత్యున్నత స్థాయికి పెంచారు. ఈ క్రమంలోనే ఈ ఆదివారం జరిగిన ఫ్యాన్స్ మీట్ లో ఊహించని దృశ్యాలు చోటుచేసుకున్నాయి. గతంలో ఎంతో స్వేచ్ఛగా బయటకు వచ్చి అభిమానులను పలకరించే అమితాబ్, ఈసారి మూడు వైపులా పూర్తిగా కవర్ చేసేలా ఏర్పాటు చేసిన భారీ పారదర్శక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ షీల్డ్ వెనుక నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. ఆయనకు రక్షణగా కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా పక్కనే నిలబడి పరిసరాలను గమనించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
ప్రాణాపాయ హెచ్చరికలు, తీవ్ర భద్రతా ఆంక్షలు ఉన్నప్పటికీ.. తనను చూడటానికి వచ్చే అభిమానులను నిరాశపరచడం ఇష్టం లేకనే అమితాబ్ ఈ రిస్క్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన ఆనవాయితీని వీడకుండా బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక నుంచే అభిమానులను పలకరించి ఆయన తన నిబద్ధతను చాటుకున్నారు. అయితే ఒక లెజెండరీ నటుడు ఇలాంటి రక్షణ వలయం మధ్య దర్శనమివ్వాల్సిన పరిస్థితి రావడం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
అమితాబ్ బచ్చన్ వీడియో..
బులెట్ ప్రూఫ్ గ్లాస్ రక్షణలో #AmitabhBachchan ..
అమితాబ్ ప్రతి ఆదివారం తన ఇంటి వద్ద అభిమానులను కలుస్తారు..
ఇటీవల #TigerShroff పై జరిగిన కాల్పుల ఘటన తర్వాత, బిగ్ బి కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ లో ఉన్నారనే ప్రచారం జరిగింది.
అందుకే అమితాబ్ ప్రస్తుతం తన సెక్యూరిటీ నిమిత్తం ప్రొటెక్టివ్ గ్లాస్ లోపల నుంచే అభిమానులను కలుస్తున్నారు.
#BishnoiGang #Bulletproof #Security
— SZN (@Suzenbabu) November 1, 2026
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
