AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దండం పెడతా బతికించండి సార్.. పోలీసులను వేడుకున్న రాప్తాడు నిందితుడు.. వీడియో

Rapthadu Girl Attack Case: రాప్తాడు బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కత్తితో దాడికి యత్నించడంతో ఈ చర్య తీసుకున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. గాయపడిన హేమంత్‌ను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దండం పెడతా బతికించండి సార్.. పోలీసులను వేడుకున్న రాప్తాడు నిందితుడు.. వీడియో
Rapthadu Case Accused Hemant
Shaik Madar Saheb
|

Updated on: Nov 02, 2026 | 7:46 AM

Share

రాప్తాడు రాక్షసుడికి బుల్లెట్ దిగింది. ఇప్పుడు వాడు చావు బతుకుల్లో ఉన్నాడు. అయినా సరే ఎవ్వరూ అతడిపై జాలి చూపడంలేదు. కారణం నిన్న వాడు చేసిన దారుణం. ఎలక్ట్రిక్ రంపంతో బాలికపై విరుచుకుపడ్డ తీరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. ఇప్పుడా బిడ్డ కొనఊపిరితో బెంగళూరు ఆస్పత్రిలో పోరాటం చేస్తోంది. త్వరగా కోలుకోవాలని, ఆనరరూప రాక్షసుడ్ని కఠినాతి కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. బాలికపై దాడి చేసిన వెంటనే పరారైన నిందితుడు హేమంత్.. ఆదివారం సాయంత్రం ఆత్మకూరు ఆడవుల్లో ఉన్నాడని పోలీసులుకు సమాచారం అందింది. వెంటనే అతడ్ని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై హేమంత్ కత్తితో దాడికి దిగాడు. దీంతో పోలీసులు వెంటనే ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే అనంతపురం ప్రుభుత్వాసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు.

ఇంత దారుణం చేసినా పశ్చాత్తాపం కనిపించడం లేదు. కనీసం తను చేసిన పాపానికి తగిన శిక్ష పడాలన్న ఇంగితం కూడా లేకుండా పోలీసులు కనిపించగానే తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ప్రయత్నించడమే కాదు, సీఐపై దాడికి కూడా దిగాడు. నిందితుడు దాడిలో సీఐ వెంకటేశుల చేతికి తీవ్ర గాయం కూడా అయింది. ఇక తప్పని సరి పరిస్థితుల్లో పారిపోతున్న హేమంత్‌పై కాల్పులు జరిపినట్లు ఎస్పీ జగదీష్‌ ప్రకటించారు.

రికవరీ చేయించండి సార్..

రాప్తాడు రాక్షసుడు హేమంత్‌ చావుబతుకుల మధ్య ఉన్నాడు.. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ కొనసాగుతోంది.. ఈ క్రమంలోనే.. తనను బతికించాలని నిందితుడు పోలీసుల్ని వేడుకున్నాడు. రికవరీ చేయించండి సార్ అంటూ బ్రతిమలాడాడు.

ఎస్పీ ఏమన్నారంటే..

హేమంత్ ఆత్మకూరు ఫారెస్ట్‌లో ఉన్నట్టు తెలిసింది.. నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్‌ బృందాలను పంపాం.. పట్టుకునే క్రమంలో సీఐపై హేమంత్ కత్తితో దాడి చేశాడు.. సీఐ గాల్లో కాల్పులుజరిపినా హేమంత్ వెనక్కి తగ్గలేదు.. మరోసారి కత్తితో దాడికి ప్రయత్నించాడు.. తప్పని పరిస్థితిలో పోలీసులు కాల్పులు జరిపారని.. ఎస్పీ తెలిపారు.

ప్రజల సంబరాలు..

రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. బాధిత విద్యార్థిని స్వగ్రామం అయ్యవారిపల్లిలో హర్షం వ్యక్తంచేస్తూ.. గ్రామస్థులు టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. పోలీస్ జిందాబాద్ అంటూ రాప్తాడులోనూ ప్రజలు నినాదాలు చేశారు.

వీడియో చూడండి..

Follow Us