AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake: అధికారులపై ఆగ్రహంతో బతికున్న పామును కరకర నమిలి తిన్న వ్యక్తి అరెస్ట్‌

అధికారులుపై ఆగ్రహంతో బతికున్న పామును నోటితో నమిలి తిన్న ఉత్తరాఖండ్‌ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నైనీతాల్ జిల్లా లాల్కువాన్ రైల్వే స్టేషన్​పరిధిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన ఇళ్లను..

Snake: అధికారులపై ఆగ్రహంతో బతికున్న పామును కరకర నమిలి తిన్న వ్యక్తి అరెస్ట్‌
Snake
Srilakshmi C
|

Updated on: May 25, 2023 | 8:48 AM

Share

అధికారులుపై ఆగ్రహంతో బతికున్న పామును నోటితో నమిలి తిన్న ఉత్తరాఖండ్‌ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నైనీతాల్ జిల్లా లాల్కువాన్ రైల్వే స్టేషన్​పరిధిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన ఇళ్లను రైల్వే అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. దీంతో కోపోధ్రిక్తుడైన ఓ వ్యక్తి అప్పుడే అక్కడికి వచ్చిన పామును నోటితో కొరికి నమిలి తిన్నాడు. చుట్టూ ఉన్నవారు వారిస్తున్నా వినిపించుకోవకుండా కసపిస నమిలేశాడు.

ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మే 18న నాగినా కాలనీలో ఆక్రమణల నిరోధక డ్రైవ్ కింద ఇళ్లను కూల్చివేస్తున్న సమయంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో కాస్తా ఫారెస్ట్ అధికారుల కంట పడింది. దీంతో సదరు వ్యక్తి ఎవరన్నదానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని నైనిటాల్ జిల్లాలోని నగీనా కాలనీకి చెందిన కమలేష్ (34)గా గుర్తించారు. వన్యప్రాణి (రక్షణ) చట్టం కింద పోలీసులు కమలేష్‌పై కేసు నమోదు చేసి.. వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించారు.

అక్రమంగా కట్టిన భవనాలను కూల్చివేస్తుండగా అదే టైంకి మద్యం మత్తులో ఉన్న నిందితుడు కమలేష్‌ ఐస్‌క్రీం స్టాల్‌లో కూర్చుని ఉన్నాడు. కమలేష్‌ పామును పట్టుకొని దాని తలను నోటితో కొరికి నమలడం ప్రారంభించారు. అది విషపూరితం కావచ్చని పక్కనే ఉన్న మరో వ్యక్తి హెచ్చరించడంతో వెంటనే కమలేష్‌ పాము తలను ఉమ్మివేసాడు. అ తర్వాత కూడా రక్తం కారుతున్న పామును కూల్‌ డ్రింక్‌తో కలిపి తినడం ప్రారంభిస్తాడు. ఈ ఘటనలో పాము మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు..
నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు..
శనివారం స్పెషల్ పిండి దీపం పూజ.. సంపద, సుఖసమృద్ధికి గ్యారంటీ..
శనివారం స్పెషల్ పిండి దీపం పూజ.. సంపద, సుఖసమృద్ధికి గ్యారంటీ..