AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Civil Services Topper: సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన తెలంగాణ బిడ్డ..’ఆ తప్పులు మీరు చేయకండి’

ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష-2022ల తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 50 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. టాప్‌ ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు అభ్యర్ధులు మెరిశారు. తెలంగాణకు చెందిన..

UPSC Civil Services Topper: సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన తెలంగాణ బిడ్డ..'ఆ తప్పులు మీరు చేయకండి'
Uma Harathi
Srilakshmi C
|

Updated on: May 24, 2023 | 12:25 PM

Share

ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష-2022ల తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 50 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. టాప్‌ ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు అభ్యర్ధులు మెరిశారు. తెలంగాణకు చెందిన ఉమా హారతి మూడో ర్యాంక్‌ సాధించి రికార్డు సృష్టించారు. ఈమెది సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌. ఉమాహారతి తండ్రి ఎన్‌.వెంకటేశ్వర్లు ప్రస్తుతం నారాయణపేట ఎస్పీగా పనిచేస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఐదో ప్రయత్నంలో ఉమా హారతి ర్యాంకు సాధించారు. తండ్రి పోలీసు అధికారి అయినప్పటికీ ఐఏఎస్‌ అవ్వడం తన లక్ష్యంగా పెట్టుకున్నారు. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌ గురించి ఉమా హారతి మాట్లాడుతూ.. ‘2017 నుంచి ప్రిపరేషన్‌ సాగించినప్పటికీ నా ఆప్షనల్‌ సబ్జెక్టు విషయంలో కొంత తప్పటడుగు వేయడం వల్ల విజయం సాధించలేకపోయాను. తొలుత జాగ్రఫీ (భూగోళశాస్త్రం)ని ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకోవడం వల్ల సరైన స్కోర్‌ చేయలేకపోయాను. దీంతో ఆంత్రొపాలజీని నా ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారె. ఈ సారి తీసుకున్న నిర్ణయం నన్ను గెలిపించింది. అలాగే ప్రశ్నలకు సమాధానం రాసే విధానంలో కూడా మార్పులు చేశాను. మునుపటి అటెంప్ట్‌లలో ఎక్కువ కంటెంట్‌ రాయడానికి ప్రాధాన్యత ఇచ్చాను. ఈ సారి డయాగ్రామ్స్‌ రూపంలో ఆన్సర్లు ఇవ్వడంపై నా దృష్టి కేంద్రీకరించాను.

ఇవి కూడా చదవండి

నిజానికి.. గ్రాడ్యుయేషన్ తర్వాత ఢిల్లీలో ఏడాది పాటు కోచింగ్ తీసుకున్నాను. కానీ కోచింగ్‌  వల్ల ప్రయోజనం లేకపోయింది. దీంతో అక్కడి నుంచి తిరిగి వచ్చి.. అప్పటికే సివిల్స్ క్రాక్ చేసిన నా ఫ్రెండ్స్‌ సలహాలు తీసుకున్నాను. అలాగే ఆన్‌లైన్ కంటెంట్‌ కూడా ఎంతో ఉపయోగపడింది. నా కుటుంబం, స్నేహితుల సహాయంతోనే సివిల్స్‌ ఛేదించగలిగానని చెప్పుకొచ్చారు. సివిల్స్‌ క్రాక్‌ చేయాలంటే స్వంత వ్యూహం రూపొందించకుండా పరీక్షను చేధించడం అసాధ్యం. వైఫల్యాలు, ఎదురుదెబ్బలకు ఎదురొడ్డి రాణించాలంటే సన్నాహక ప్రక్రియ పటిష్టంగా ఉండాలన్నారు. సివిల్స్‌ ఆశావహ అభ్యర్ధులకు సలహా ఇస్తూ.. ‘ప్రిపరేషన్‌ టైంలో మానసికంగా ధృడంగా ఉండాలి. ఎందుకుంటే సివిల్స్‌ క్రాక్‌ చేయడం కేవలం ఒక ఏడాదిలో సాధ్యపడకపోవచ్చు. చాలా సంవత్సరాలు పట్టవచ్చు. ఇది మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది’ అని మార్గనిర్దేశకం చేశారు.

యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 3వ ర్యాంక్ సాధించిన ఉమా హారతిని సోషల్ మీడియా వేదికగా వీసీ సజ్జనార్, నారాయణపేట్ ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు అభినందించారు.

తాజా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో.. అన్నమయ్య జిల్లాకు చెందిన పవన్‌ దత్తా 22వ ర్యాంకు, రాజమండ్రికి చెందిన తరుణ్‌ 33వ ర్యాంకు, ఎమ్మిగనూరుకు చెందిన అంబికా జైన్‌కు 69వ ర్యాంకు సాధించారు. వందలోపు 10 మంది మనవాళ్లే. సివిల్‌ సర్వీస్‌ ర్యాంకుల్లో తొలి నాలుగు స్థానాలు అమ్మాయిలవే కావడం మరో విశేషం. ఇషితా కిశోర్‌ తొలి ర్యాంకు సాధించగా, గరిమా లోహియా 2వ ర్యాంక్‌, నూకల ఉమాహారతి 3వ ర్యాంక్‌, స్మృతి మిశ్రా 4వ ర్యాంకులతో మెరిశారు.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.