IRCTC: ట్రైన్ టికెట్ కోసం డబ్బులు లేవా? ఫ్రీగా జర్నీ చేయండిలా.. కానీ కండీషన్స్ అప్లై..!
మన దేశ రవాణా వ్యవస్థలో అత్యంత చౌకైన ప్రయాణ సాధనం.. ట్రైన్. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు.. ఎక్కువగా ట్రైన్ ప్రయాణాన్నే ఎంచుకుంటారు. కారణం.. టిక్కెట్ ధర తక్కువ, సమయం తక్కువ.. కంఫర్ట్‌గా ఉండటం. అందుకే.. ప్రతి రోజూ లక్షలాది మంది ప్రజలు ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారు. ఇక అదే సమయంలో ఇండియన్ రైల్వేస్..
మన దేశ రవాణా వ్యవస్థలో అత్యంత చౌకైన ప్రయాణ సాధనం.. ట్రైన్. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు.. ఎక్కువగా ట్రైన్ ప్రయాణాన్నే ఎంచుకుంటారు. కారణం.. టిక్కెట్ ధర తక్కువ, సమయం తక్కువ.. కంఫర్ట్‌గా ఉండటం. అందుకే.. ప్రతి రోజూ లక్షలాది మంది ప్రజలు ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారు. ఇక అదే సమయంలో ఇండియన్ రైల్వేస్.. ప్రయాణికుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. నిత్యం కొత్త కొత్త సుదుపాయాలను కల్పిస్తోంది. ఇటీవల ఇండియన్ రైల్వేస్ తన ప్రయాణికుల కోసం మరో కొత్త సౌకర్యాన్ని తీసుకువచ్చింది. డబ్బులు లేకుండా ఇబ్బంది పడే ప్రయాణికులకు ఈ సౌకర్యం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అవును, ప్రయాణికులు డబ్బులు లేకుండానే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆకస్మికంగా ప్రయాణించాల్సి వస్తే.. టిక్కెట్‌కు డబ్బులు లేకుంటే.. ఇకపై చింతించాల్సిన పనిలేదు. డబ్బులు లేకున్నా టికెట్ బుక్ చేసుకోవచ్చు. మీ ప్రయాణాన్ని పూర్తి చేయొచ్చు. మరి ఈ సదుపాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందు ప్రయాణించండి.. తరువాత చెల్లించండి..
ఇండియన్ రైల్వేస్.. తన ప్రయాణీకులకు డబ్బు లేకుండా టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ సదుపాయం కింద, ప్రయాణీకులు తమ టికెట్ డబ్బును తర్వాత చెల్లించవచ్చు. ‘Buy Now Pay Later’ పేరుతో IRCTC ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది. Paytm అందిస్తున్న Paytm Postpaid అకౌంట్ నుంచి ఈ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు.
Buy Now Pay Later కోసం ఇలా చేయండి..
1. ముందుగా ఐఆర్‌సీటీసీ యాప్‌కి లాగిన్ అవ్వాలి.
2. టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాలి.
3. ఏ ట్రైన్‌లో ప్రయాణించాలనుకుంటున్నారు, ఎక్కడికి ప్రయాణం వంటి వివరాలు పేర్కొనాలి.
4. డబ్బులు చెల్లింపు కోసం ‘Buy Now Pay Later’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దానిపై క్లిక్ చేయాలి.
5. అప్పుడు పేటీఎం పోస్ట్‌పోయిడ్ పేజ్‌కి వెళ్తుంది.
6. చెల్లింపును పూర్తి చేయడానికి పేటీఎం రిజిస్టర్డ్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
7. ఇప్పుడు ఓటీపీని ఎంటర్ చేసిన తరువాత మీ టికెట్ బుక్ అవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..