AC Using Tips: ‘ఏసీ’ని ఇలా వాడండి.. కరెంట్ బిల్లు చాలా తగ్గుతుంది..!
అసలే వేసవి కాలం.. అంతుచిక్కని గజిబిజి వాతావరణంతో ఉక్కపోత ఎక్కువైపోతుంది. ఫలితంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఈ ఉక్కపోత, వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఎయిర్ కండీషనర్స్, కూలర్స్ వంటి ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేస్తున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదంటే.. కూలింగ్ సిస్టమ్‌ని కొనేస్తున్నారు.
అసలే వేసవి కాలం.. అంతుచిక్కని గజిబిజి వాతావరణంతో ఉక్కపోత ఎక్కువైపోతుంది. ఫలితంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఈ ఉక్కపోత, వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఎయిర్ కండీషనర్స్, కూలర్స్ వంటి ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేస్తున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదంటే.. కూలింగ్ సిస్టమ్‌ని కొనేస్తున్నారు. అయితే, కొనుగోలు వరకు బాగానే ఉన్నా.. ఆ తరువాతే కరెంట్ బిల్లు రూపంలో బ్యాండ్ బజాయిస్తుంది. ఏసీ, కూలర్ వినియోగం వల్ల భారీ ఎత్తు కరెంట్ బిల్లులు వస్తుంటాయి. దాంతో ఆ బిల్లులు కట్టలేక వినియోగదారులు బాబోయ్ అని నిట్టూరుస్తారు. అయితే, ఇవాళ మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం. తద్వారా ఏసీ, కూలర్ వినియోగం వలన కరెంట్ బిల్లు ఎక్కువగా రాకుండా ఉంటుంది. మరి ఈ చిట్కాలేంటో ఓ లుక్కేసుకోండి..
1. ఏసీ వినియోగం వల్ల కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి 5 స్టార్ ఏసీలను కొనుగోలు చేయాలి. తక్కువ స్టార్లు కలిగిన ఏసీల వినియోగం వల్ల విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుంది.
2. మరీ తక్కువ టెంపరేచర్ కాకుండా.. 24 డిగ్రీల వద్ద ఏసీని నడపాలి.
3. టైమర్ ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా కూడా కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు.
4. ఏసీని రన్ చేయాలనుకుంటున్న సమయం, ఆఫ్ చేయాలనుకుంటన్న సమయాన్ని సెట్ చేసుకోవడం ద్వారా కరెంట్ బిల్లు ఆదా అవుతుంది.
5. ఏసీ కండీషన్ సరిగా ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. రెగ్యూలర్‌గా సర్వీస్ చేయిస్తుండాలి.
6. డోర్స్, విండోస్ మూసి ఉంచాలి. తద్వారా త్వరగా రూమ్ కూల్ అవుతుంది. ఆ తరువాత ఏసీ ఆఫ్ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..