AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coin Tree: ఇంట్లో ఈ చెట్టును పెడితే డబ్బే డబ్బు! లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపైనే..!

Coin Tree Benefits: చైనీస్ వాస్తు ఫెంగ్‌షుయ్‌లో.. ఇంట్లో సంపద, ఆనందం, శ్రేయస్సు, శాంతి కోసం అనేక మార్గాలు చెప్పడం జరిగింది. వాస్తవానికి చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో మనీ ప్లాంట్‌ను పెంచుతారు. తద్వారా వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవని, సంపద వృద్ధి కలుగుతుందని విశ్వాసం. అయితే, ఇవాళ మనం మనీ ప్లాంట్ కంటే ప్రభావవంతమైన చెట్టు గురించి తెలుసుకుందాం.

Coin Tree: ఇంట్లో ఈ చెట్టును పెడితే డబ్బే డబ్బు! లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపైనే..!
Coins Tree
Shiva Prajapati
|

Updated on: May 22, 2023 | 8:57 AM

Share

చైనీస్ వాస్తు ఫెంగ్‌షుయ్‌లో.. ఇంట్లో సంపద, ఆనందం, శ్రేయస్సు, శాంతి కోసం అనేక మార్గాలు చెప్పడం జరిగింది. వాస్తవానికి చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో మనీ ప్లాంట్‌ను పెంచుతారు. తద్వారా వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవని, సంపద వృద్ధి కలుగుతుందని విశ్వాసం. అయితే, ఇవాళ మనం మనీ ప్లాంట్ కంటే ప్రభావవంతమైన చెట్టు గురించి తెలుసుకుందాం. ఫెంగ్‌షుయ్ ప్రకారం.. నాణేల చెట్టును ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాయిన్స్ ట్రీ.. సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ఈ చెట్టు ఉన్న ప్రదేశంలో డబ్బు ఉంటుందని విశ్వాసం. కాయిన్స్ ట్రీని ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

కాయిన్స్ ట్రీ వల్ల కలిగే ప్రయోజనాలు..

1. ఫెంగ్‌షుయ్ ప్రకారం.. కాయిన్స్ ట్రీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించడం ద్వారా సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది. నాణేల చెట్టు ఉండే ఇంట్లో ఎప్పుడూ సంపద వృద్ధి కలుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉండవు. ఇంట్లో డబ్బు రాకకు మార్గం సుగమం చేస్తుందని విశ్వాసం.

2. డబ్బును దాచే ప్రదేశంలో ఈ నాణేల చెట్టును ఉంచాలి. కాయిన్స్ ట్రీ సంపద, శ్రేయస్సును పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే దీనిని లాకర్, బీరువా వద్ద ఉంచడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

3. కాయిన్ ట్రీని కూడా ఆఫీసులో పెట్టుకోవచ్చు. దీని కారణంగా మీ వ్యాపారంలో పురోగతి ఉంటుంది. డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు.

4. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో కాయిన్ ట్రీ మీకు సహాయపడుతుందని ఫెంగ్‌షుయ్‌లో పేర్కొన్నారు. ఈ చెట్టు ఉన్న చోట, వ్యక్తి లావాదేవీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటారు.

5. కాయిన్స్ ట్రీ ఏర్పాటు చేసే ప్రదేశం కూడా చాలా ముఖ్యమైనది. నీడ లేని ప్రదేశంలోనే ఈ ట్రీని పెట్టాలి.

6. నాణేల చెట్టును డబ్బు కొరత ఉన్న ప్రదేశంలో ఏర్పాటు చేయొచ్చు. ఈ చెట్టు నాణేల సేకరణను సూచిస్తుంది. అందుకే డబ్బుకు లోటు ఉన్న చోట ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఫెంగ్‌షుయ్‌లో పేర్కొన్నారు.

గమనిక: పైన పేర్కొన్న వ్యాసం.. మత గ్రంధాలు, జ్యోతిష్యశాస్త్రం, ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీలో మస్ట్ వాచ్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మస్ట్ వాచ్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..
సార్సాల దాడి కేసులో సంచలన తీర్పు..!
సార్సాల దాడి కేసులో సంచలన తీర్పు..!
వర్షాకాలంలో కప్పల గోల ఎక్కువైందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
వర్షాకాలంలో కప్పల గోల ఎక్కువైందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
కొత్త చరిత్ర లిఖించిన రోకో జోడీ.. ఇది కదా కావాల్సింది!
కొత్త చరిత్ర లిఖించిన రోకో జోడీ.. ఇది కదా కావాల్సింది!
2800 కి.మీ. విమాన ప్రయాణం,మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరింది!
2800 కి.మీ. విమాన ప్రయాణం,మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరింది!
గ్యాస్ సిలిండర్ పైప్ ఎప్పుడు మార్చాలి? ఈ డేంజర్ సంకేతాలు ఇవే!
గ్యాస్ సిలిండర్ పైప్ ఎప్పుడు మార్చాలి? ఈ డేంజర్ సంకేతాలు ఇవే!
ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే..
ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే..
ఇంగ్లాండ్ గడ్డ..కింగ్ అడ్డా! రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డ్
ఇంగ్లాండ్ గడ్డ..కింగ్ అడ్డా! రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డ్