Health Tips: వేసవిలో ఆహారంతో జాగ్రత.. ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి.. లేదంటే ఆస్పత్రిపాలవుతారు..!
వేసవిలో మీ ఆరోగ్యంపైనే కాకుండా ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో కూరగాయలు, ఆహారం, ఆహార పదార్థాలు త్వరగా పాడైపోతాయి. దీని కారణంగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కలుషిత ఆహారం తింటే అందులోని హానికరమైన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్‌లు, రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి వ్యాధుల బారిన పడే ఛాన్స్ ఉంది.

కలుషిత ఆహారం తినడం వల్ల.. వికారం, వాంతులు, విరేచనాలు, జ్వరం రావడమే కాకుండా.. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా అవ్వొచ్చు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. దీని కారణంగా ఆహారం కలుషితమవుతుంది. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి ఆహారాన్ని కలుషితం కాకుండా కాపాడుతాయి.
ముడి పదార్థాలను వేరుగా ఉంచాలి..
ఆహారం కలుషితం కాకుండా ఉండటానికి.. మాంసం, ఇతర కూరగాయలు వంటి ముడి పదార్థాలను విడి విడిగా ఉంచాలి. ముడి పదార్థాలు, వండిన ఆహారం కోసం ప్రత్యేక కట్టింగ్ బోర్డులు, పాత్రలను ఉపయోగించాలి. అలాగే, వినియోగించిన పాత్రలు, వస్తువులను సరిగా శుభ్రం చేయాలి.
సరిగ్గా ఉడికించాలి..
తినే ఆహారాన్ని సరిగా ఉడికించాలి. అవసరమైన మేరకు ఉడికించడం ద్వారా హానీకరమైన బ్యాక్టీరియా చనిపోతుంది. ఇక వండిన ఆహారం వేడికగా ఉండేందుకు థర్మోస్‌ను ఉపయోగించవచ్చు.
వంటగది శుభ్రంగా ఉంచాలి..
ఆహారం చెడిపోకుండా వంటగిదిని శుభ్రంగా ఉంచుకోవాలి. కౌంటర్లు, కంటింగ్ బోర్డులు, పాత్రలను ఆహారం సిద్ధం చేయడానికి ముందు, తర్వాత శుభ్రంగా కడగాలి. వేడి నీటితో కడగే ప్రయత్నం చేయాలి.
చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలి..
ఇక వేసవిలో ఆహారం పాడవకుండా ఉండటానికి ముందుగా.. చేతులను శుభ్రం చేసుకోవాలి. కూరగాయలు, ఇతర పదార్థాలను వండే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. గోరువెచ్చిని నీటితో కడుక్కోవడం వల్ల చేతులకు ఉండే బ్యాక్టీరియా మొత్తం పోతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..