Helmet Features: హెల్మెట్ కొనుగోలు చేస్తున్నారా? అయితే, ఈ విషయాలను తప్పక గమనించండి..

ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెల్ ధరించాలి. రోడ్డు ప్రమాదాల బారిన పడిన, ప్రాణాపాయానికి గురికాకుండా ఉండాలంటే.. హెల్మెట్ తప్పనిసరి. రైడర్ మాత్రమే కాకుండా.. పైలాన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించడం క్షేమం. అయితే, చాలా మంది వివిధ కారణాల వల్ల..హెల్మెట్ పెట్టుకోవడానికి ఇంట్రస్ట్ చూపరు.

Helmet Features: హెల్మెట్ కొనుగోలు చేస్తున్నారా? అయితే, ఈ విషయాలను తప్పక గమనించండి..
Helmet
Follow us
Shiva Prajapati

|

Updated on: May 20, 2023 | 10:16 PM

ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెల్ ధరించాలి. రోడ్డు ప్రమాదాల బారిన పడిన, ప్రాణాపాయానికి గురికాకుండా ఉండాలంటే.. హెల్మెట్ తప్పనిసరి. రైడర్ మాత్రమే కాకుండా.. పైలాన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించడం క్షేమం. అయితే, చాలా మంది వివిధ కారణాల వల్ల..హెల్మెట్ పెట్టుకోవడానికి ఇంట్రస్ట్ చూపరు. ఇలా చేయడం వారికే చేటు చేస్తుంది. పొరపాటున రోడ్డు ప్రమాదానికి గురైతే.. హెల్మెట్ లేకుండా ఉండే.. ప్రాణాలే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మీరు, మిమ్మల్నే నమ్ముకున్న మీ కుటుంబం సంతోషంగా, సురక్షితంగా ఉండాలంటే.. డ్రైవింగ్ చేసే సమయంలో ఎట్టి పరిస్థితిలో హెల్మెట్ ధరించాలి. అయితే, కొందరు ఏదో మమ అన్నట్లుగా నాణ్యతలేని, పలచని హెల్మెట్స్ ధరిస్తారు. అది కూడా ప్రమాదకరమే. నాణ్యమైన హెల్మెట్ కొని, ప్రాణాలను నిలుపుకోండి. ఇక హెల్మెట్ కొనే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హెల్మెట్ కొనేముందు ఇవి పరిగణనలోకి తీసుకోవాలి..

1. మీ తలకు సరిపోయే, సౌకర్యవంతమైన హెల్మెట్‌ను కొనుగోలు చేయాలి. ఒకవేళ సౌకర్యంగా లేకపోతే.. ఇబ్బంది పడటం వల్ల డ్రైవింగ్ చేసే సమయంలో మీ దృష్టి మరలే అవకాశం ఉంది.

2. సరైన వెంటిలేషన్ ఉండే హెల్మెట్ కొనుగోలు చేయాలి.

ఇవి కూడా చదవండి

3. కొన్ని హెల్మెట్స్.. ఫైబర్‌, గ్లాస్ మిశ్రమంతో తయారు చేస్తున్నారు. అయితే, నాణ్యమైన హెల్మెట్స్.. కార్బన్ మిశ్రమాలు, కెవ్లార్‌‌లను ఉపయోగించి చేస్తారు. ఇది తల నుంచి వచ్చే చెమటను పీల్చుకుంటుంది.

4. ప్రమాదాల సమయంలోనూ ఎలాంటి అపాయం జరుగకుండా ఉండాలంటే.. నాణ్యమైన హెల్మెట్‌నే కొనుగోలు చేయాలి.

5. ISI మార్క్ ఉన్న హెల్మెట్‌నే కొనుగోలు చేయాలి. బయట మార్కెట్‌లో డమ్మీ హెల్మెట్స్ కూడా ఉన్నాయి. వాటిని పరిశీలించి కొనుగోలు చేయాలి.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..