Indian Railway: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతోనే అండమాన్-నికోబార్ చుట్టేసి రావొచ్చు..!

IRCTC Tour Package: పర్యాటకుల కోసం అద్దిరిపోయే ఆఫర్ ప్రకటించింది ఐఆర్‌సిటిసి. అండమాన్ నికోబార్ టూర్‌కు వెళ్లాలనుకునే టూరిస్టుల కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. సముద్రం, ప్రకృతి అందాలను చూడాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన..

Indian Railway: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతోనే అండమాన్-నికోబార్ చుట్టేసి రావొచ్చు..!
Irctc Tour
Follow us

|

Updated on: May 20, 2023 | 9:45 PM

పర్యాటకుల కోసం అద్దిరిపోయే ఆఫర్ ప్రకటించింది ఐఆర్‌సిటిసి. అండమాన్ నికోబార్ టూర్‌కు వెళ్లాలనుకునే టూరిస్టుల కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. సముద్రం, ప్రకృతి అందాలను చూడాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు. అతి తక్కువ ధరకే.. అందమైన ప్రదేశాలను చుట్టివచ్చే అవకాశం కల్పించింది ఇండియన్ రైల్వేస్. జస్ట్ రూ. 53,400 లకే 6 పగళ్లు, 5 రాత్రుల అండమాన్ నికోబార్ దీవుల సందర్శించే అవకాశాన్ని కల్పించింది ఇండియన్ రైల్వేస్. అంతేకాదు.. కౌంట్ పెరిగే కొద్ది అమౌంట్ కూడా తగ్గిస్తుంది. మీరు కూడా అండమాన్ నికోబార్ దీవులను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరి ఈ ప్లాన్ ఏంటి? ధరలు ఎంత? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఆర్‌సీటీసీ అండమాన్-నికోబార్ టూర్‌ ప్యాకేజీ వివరాలు..

⇒ కోల్‌కతా నుంచి అందుబాటులో ఉన్న ఈ టూర్ ప్యాకేజీ ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానుంది.

⇒ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 16 వరకు అండమాన్-నికోబార్ టూర్ ప్యాకేజీ ఉండగా.. అందుకు అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

⇒ ఈ ప్యాకేజీలో మొత్తం 6 పగలు, 5 రాత్రులు ఉంటుంది.

⇒ కోల్‌కతా నుంచి పోర్ట్‌ బ్లెయిర్‌కు విమానంలో ప్రయాణం ఉంటుంది.

⇒ ఈ టూర్‌లో భాగంగా.. ఫోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్, నీల్ ద్వీపాన్ని సందర్శించే అవకాశం ఉంది.

⇒ 6 పగలు, 5 రాత్రులు ఉన్న ఈ టూర్ ప్యాకేజీలో బస చేయడానికి హోటల్ సౌకర్యం కూడా ఉంది.

⇒ ఆయా ప్రాంతాల్లో రవాణా కోసం బస్సు సౌకర్యం కూడా ఉంది. నీల్ ఐలాండ్, హేవ్‌లాక్ లలో లగ్జరీ క్రూయిజ్‌ను కూడా ఎంజాయ్ చేయొచ్చు.

⇒ అన్నింటికంటే ముఖ్యంగా ప్రయాణికులందరికీ ఐఆర్‌సీటీసీ నుంచి ప్రయాణ బీమా కూడా కల్పిస్తోంది.

⇒ ఇక టూర్ ప్యాకేజీ ఛార్జెస్ విషయానికి వస్తే.. ఒక్క వ్యక్తికి రూ. 53,400 ఛార్జ్ చేయనున్నారు. ఇద్దరు వ్యక్తులు అయితే ఒక్కొక్కరికి రూ. 40,900, ముగ్గురు అయితే ఒక్కొక్కరికి రూ. 39,600 చొప్పున చార్జెస్ ఉన్నాయి.

⇒ ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!