- Telugu News Human Interest Fridge Cleaning Tips: Fallow These Easy Tips to Clean Refrigerator Door Gasket Dust
Fridge Door: ఫ్రిజ్ డోర్‌లోని రబ్బర్‌కి మురికిపట్టిందా? ఇలా చేస్తే క్షణాల్లో కొత్తదానిగా మారిపోతుంది..!
How to clean refrigerator door gasket: ప్రతి ఒక్కరి వంటగదిలో ఫ్రిజ్ ఉంటుంది. ఇలా మాట్లాడితే ఫ్రిజ్ డోర్ మీద ఉండే రబ్బరు త్వరగా చెడిపోయి మురికిగా మారుతుంది. అందువల్ల, ఈ మురికి రబ్బరును శుభ్రం చేయడం చాలా ముఖ్యం.
Updated on: May 20, 2023 | 4:21 PM

Fridge Cleaning Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది ఇళ్లలో ఫ్రిజ్‌ను వినియోగిస్తున్నారు. అయితే, ఫ్రిజ్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల డోర్‌పై ఉన్న రబ్బరు పాడైపోతుంది. ఈ రబ్బరును శుభ్రం చేయడం చాలా ముఖ్యం. చాలా మంది ఈ మురికి పట్టిన రబ్బరును శుభ్రం చేయరు. ఫలితంగా ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు అది మురికిగా, దుర్గంధంతో కనిపిస్తుంది. పైగా.. ఈ రబ్బర్‌ను శుభ్రం చేయకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే.. ఫ్రిజ్ డోర్ రబ్బరును సమయానికి శుభ్రం చేయడం చాలా ముఖ్యం. మరి ఆ రబ్బరును ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టూత్‌పేస్ట్: ఫ్రిజ్ డోర్ రబ్బరునును క్లీన్ చేయడానికి టూత్ పేస్ట్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ టూత్‌పేస్ట్ రబ్బరును వెంటనే క్లీన్ చేస్తుంది. టూత్ బ్రష్‌పై పేస్ట్ అప్లై చేసి, ఆ పై రబ్బరును క్లీన్ చేయాలి. ఇలా చేయడం ద్వారా రబ్బరు క్లీన్ అవుతుంది.

వెనిగర్: వెనిగర్ ఉపయోగించి కూడా ఫ్రిజ్ డోర్ రబ్బరును సులభంగా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో నీటిని తీసుకొని అందులో ఐదు, ఆరు చుక్కల వెనిగర్ కలపాలి. దానిని స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఆ తర్వాత స్ప్రే చేసి గుడ్డతో తుడవాలి. ఇలా చేయడం వల్ల మురికి రబ్బరు వెంటనే క్లియర్ అవుతుంది.

నిమ్మకాయ: ఒక గిన్నెలో నిమ్మరసం తీసుకుని ఫ్రిజ్ రబ్బర్‌పై గుడ్డ సహాయంతో అప్లై చేయాలి. ఇలా చేస్తే నిమిషాల్లో క్లియర్ అవుతుంది.