- Telugu News Photo Gallery Science photos NASA: Mars Mission of Nasa Life will be there Planet full of Water, See Latest Pictures of Red Planet
Mars Mission: అంగారకుడిపై జీవ విధ్వంసం ఎలా జరిగింది.. నాసాకు బూస్ట్ ఇచ్చిన తాజా మార్స్ ఫోటోలు..!
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కు చెందిన మార్స్ ప్రిజర్వేషన్ రోవర్ అంగారకుడిపై విశేష పరిశోధనలు జరుపుతోంది. మార్స్‌కు సంబంధించిన అనేక ఫోటోలను తాజాగా నాసా సెంటర్‌కు పంపింది రోవర్. ఈ ఫోటోలు శాస్త్రవేత్తలో సరికొత్త ఆసక్తిని రేపుతున్నాయి.
Updated on: May 20, 2023 | 3:20 PM

అంగారక గ్రహంపై జీవం ఉనికి గురించిన సమాచారం కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే.. మార్స్‌పై జీవం ఉనికి ఆనవాళ్లు కనిపించాయి. నాసా మార్స్ ప్రిజర్వేషన్ రోవర్ పంపిన ఫోటోలో ఈ ఆనవాళ్లను మరింత ధృవీకరిస్తున్నాయి. దాంతో.. అంగారకుడిపై జీవం ఉండేందుకు ఆవకాశం ఉంటే, ఎప్పుడు ఉంది? విధ్వంసం ఏమైనా సంభవించిందా? వివిధ కోణాల్లో కారణాలను పరిశీలిస్తున్నారు శాస్త్రవేత్తలు.

మార్స్ రోవర్ తీసిన కొత్త చిత్రాల ప్రకారం.. మార్స్‌పై ఒకప్పుడు నదులు, నీటి ప్రవాహాలు, సరస్సులు చాలా ఉండేవని తెలుస్తోంది. విశేషమేమిటంటే, ఈ నదులు ఊహించిన దానికంటే చాలా లోతుగా, వేగంగా ప్రవహించే స్థాయిలో ఉన్నాయని ఆ ఫోటోలను బట్టి అంచనా వేస్తున్నారు నిపుణులు. ఈ లెక్కన.. నదుల ఉనికి బట్టి జీవం కూడా ఉండే అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు పరిశోధకలు.

రోవర్.. ఒక వంపుతిరిగిన శిలకు సంబంధించిన క్లోజ్ అప్ చిత్రాన్ని కూడా పంపింది. శాస్త్రవేత్తలు ఈ ప్రాంతానికి స్ప్రింక్ల్ హెవెన్ అని పేరు పెట్టారు. ఇది కాకుండా, జెజెరో క్రేటర్ ప్రాంతం చిత్రాలు కూడా శాస్త్రవేత్తలు అందుకున్నారు. ఈ ఫోటో ప్రకారం.. ఇక్కడ ఒకప్పుడు సరస్సు ఉండేదని అంచనా వేస్తున్నారు.

నాసాకు చెందిన ఈ రోవర్ గత రెండేళ్లుగా అంగారకుడిపై పరిశోధనలు చేస్తోంది. ఈ అరుణ గ్రహంపై బిలియన్ల సంవత్సరాల క్రితం జీవి ఉండే అవకాశం ఉంటుందని, ఆ జీవి ఉనికి కోసం ఈ రోవర్ అన్వేషిస్తోంది. ఈ రోవర్.. అంగారకుడిపై గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి? గ్రహం నిర్మాణ ఎలా ఉంటుంది అనే దానిపై పరిశోధన చేస్తోంది. ఈ క్రమంలోనే.. మార్స్‌పై జెజెరో క్రేటర్ అనే ప్రాంతాన్ని దాటుతూ ముందుకు సాగుతోంది.