Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ వ్యాధి గ్రస్తుల పాలిట వరం ఈ కూరగాయ..ఇన్సులిన్ మందు కన్నా తక్కువేమీ కాదట..

షుగర్ ఒక ప్రమాదకరమైన వ్యాధి. దీంతో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. షుగర్ ఒక నయం చేయలేని వ్యాధి.

షుగర్ వ్యాధి గ్రస్తుల పాలిట వరం ఈ కూరగాయ..ఇన్సులిన్ మందు కన్నా తక్కువేమీ కాదట..
Beans
Follow us
Madhavi

| Edited By: Ravi Kiran

Updated on: May 22, 2023 | 7:20 AM

షుగర్ ఒక ప్రమాదకరమైన వ్యాధి. దీంతో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. షుగర్ ఒక నయం చేయలేని వ్యాధి. కానీ సరైన ఆహారం ,ఆరోగ్యకరమైన జీవనశైలి సహాయంతో ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ప్రస్తుతం చెడు ఆహారపు అలవాట్లు, చెడు అలవాట్ల కారణంగా ఈ వ్యాధి చాలా మందిని తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. షుగర్ నయం చేయలేని వ్యాధి కావచ్చు, కానీ దానిని అదుపులో ఉంచుకోవడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మీ ఆహార కోరికలను నియంత్రించడం ద్వారా, మీరు ఈ వ్యాధిని సులభంగా ఎదుర్కోవచ్చు.

షుగర్ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి ఫైబర్ , ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. బీన్స్ వంటి బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించగల కొన్ని కూరగాయలు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంతో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. బీన్స్ డయాబెటిక్ రోగులకు సూపర్ ఫుడ్. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, బీన్స్ చాలా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని నియంత్రించడానికి కారణం. బీన్స్‌లో ప్రోటీన్ , ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తాయి.

డయాబెటిక్ రోగులకు బీన్స్ ఎందుకు ప్రయోజనకరంగా ఉంటాయి?

ఇవి కూడా చదవండి

న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, పింటో బీన్స్, బ్లాక్ బీన్స్ లేదా రెడ్ కిడ్నీ, బీన్స్ తిన్న టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగుల రక్తంలో చక్కెర పెరుగుదల కనిపించలేదు. బీన్స్ తిన్న 90, 120 , 150 నిమిషాల తర్వాత కూడా రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. బీన్స్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ ఉన్న రోగులకు మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వాటిలో ఫైబర్ కూడా గణనీయమైన స్థాయిలో ఉంటుంది. బీన్స్ బియ్యం లేదా బంగాళదుంపల కంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉంటుంది.

బీన్స్ ఎలా తినాలి?

వైద్యులు ప్రకారం, బీన్స్ అన్నం లేదా రోటీతో వడ్డించుకోవచ్చు. కొంతమంది దీనిని సైడ్ డిష్‌గా కూడా ఉపయోగిస్తారు. అంతే కాదు, బీన్స్‌ను సలాడ్‌లు, సూప్‌లు కూడా వాడుకోవచ్చు. అయితే, దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవడం అవసరం. బీన్స్ నుండి ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి, వెల్లుల్లి , అల్లంతో కలిపి తినాలని కొందరు వైద్యులు అంటున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం