Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Wheat Benefits: నల్ల గోధుమలతో ఆరోగ్యం పదిలం.. షుగర్ పేషేంట్స్‌కు ఓ వరం.. ధరకూడా అధికమే..

నల్ల గోధుముల ధర మాములు గోధుమల ధర కంటే చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాదు పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ నల్ల గోధుమలు షుగర్ పేషేంట్స్ కు ఒక వరం వంటివి అని పోషకార నిపుణులు చెప్పారు. నల్ల గోధుమలతో తయారు చేసిన రొట్టెలను తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని పేర్కొన్నారు. 

Black Wheat Benefits: నల్ల గోధుమలతో ఆరోగ్యం పదిలం.. షుగర్ పేషేంట్స్‌కు ఓ వరం.. ధరకూడా అధికమే..
Black Wheat Health Benefits
Follow us
Surya Kala

|

Updated on: May 22, 2023 | 10:10 AM

గత కొంతకాలంగా ఆరోగ్యపై శ్రద్ధ పెరిగింది. దీంతో ఖరీదుతో సంబంధం లేకుండా పోషకాలు ఇచ్చే ఆహారం తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో గత కొంతకాలంగా నల్ల గోధుమల వినియోగం ఎక్కువ అయింది.    గోధుములంటే బ్రౌన్ క‌ల‌ర్‌లో ఉండేవి మాత్రమే కాదు.. న‌ల్ల గోధుమ‌లూ ఉంటాయి. అయితే ఈ నల్ల గోధుముల ధర మాములు గోధుమల ధర కంటే చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాదు పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ నల్ల గోధుమలు షుగర్ పేషేంట్స్ కు ఒక వరం వంటివి అని పోషకార నిపుణులు చెప్పారు. నల్ల గోధుమలతో తయారు చేసిన రొట్టెలను తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని పేర్కొన్నారు.

నల్లగోధుమలో పోషకాలు 

నల్ల గోధుమలలో గ్లూటెన్ తక్కువగా ఉంటుంది. ఫైబర్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, బి విటమిన్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కాల్షియం, ఐరన్, కాపర్, పొటాషియం వంటివి అధికంగా ఉంటాయి. కనుక నల్ల గోధుమ పిండితో పుల్కా, చపాతీ, పరాఠా, బ్రెడ్ ఇలా ఏ రూపంలో ఉన్నా శరీరానికి  ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా అందుతాయి.

ఇవి కూడా చదవండి

జీవక్రియ సమస్య నివారణకు.. 

ఈ నల్ల గోధుమల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు  జీవక్రియ సమయంలో శరీరంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తాయి. దీంతో జీవక్రియ సమస్యలను నివారిస్తాయి.

క్యాన్సర్ నివారణకు 

నల్ల గోధుమలు క్యాన్సర్‌ను నయం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయట. బరువును అదుపులో ఉంచుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించే గుణం ఉందని పేర్కొన్నారు.

రోగనిరోధక శక్తి 

నల్ల గోధుమల్లో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉండడంతో త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గటానికి సహాయపడతాయి.

గుండె ఆరోగ్యం కోసం 

నల్ల గోధుమలలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

అదనపు కొవ్వుని కరిగించడంలో 

నల్ల గోధుమలు కాలేయంలోని అదనపు కొవ్వును కరిగింది. దీంతో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. అంతేకాదు రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

రక్తహీనత నివారణకు 

నల్ల గోధుమలలో ప్రొటీన్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటాయి. నల్ల గోధుమ ఆహారాన్ని తీసుకోవడం వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది.

అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే నల్ల గోధుమలను వారంలో రెండు సార్లు తినటానికి ప్రయత్నం చేయండి.  అయితే బ్లాక్ వీట్ తో తయారు చేసిన ఉత్పత్తులు కూడా ఇంకా మార్కెట్ లో అందుబాటులో లేవు.

నల్ల గోధుమల పంట కొంచెం ఖర్చుతో కూడుకుంది. అంతేకాదు అనేక పోషక ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో నల్ల గోధుమల ధర మార్కెట్‌లో సాధారణ గోధుమలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. సాధారణ గోధుమ ధర మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.2,000 ఉంటే.. నల్ల గోధుమ ధర క్వింటాల్‌కు రూ.7-8 వేల వరకు ఉంటుంది.

Note: ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..