Summer Tourist Places: వేసవి వినోదం కోసం జూన్ లో ఈ పర్యాటక ప్రదేశాలు బెస్ట్ ఎంపిక..
మీరు వేసవి సెలవుల్లో కుటుంబం, పిల్లలతో కలిసి విహారయాత్రను ప్లాన్ చేసుకుంటున్నారా. ఈ రోజు దేశంలో అందమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం. జూన్ నెలలో సందర్శించడానికి మంచి అనువైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
Updated on: May 21, 2023 | 12:36 PM

వేసవి కాలంలో చాలా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు సెలవులు ఇస్తారు. ఈ సెలవుల్లో పిల్లలు, కుటుంబ సభ్యులతో కొన్ని అద్భుతమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. అలాంటి కొన్ని ఉత్తమ పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఇవి జూన్ నెలలో సందర్శించడానికి మంచి ప్రదేశాలు. మీరు ఇక్కడ జీవితంలో మరచిపోలేని అందమైన జ్ఞాపకాలను పోగు చేసుకోవచ్చు.

గుల్‌మార్గ్ - వేసవి వినోదంగా అందమైన ప్రకృతి అందాల నడుమ గుల్‌మార్గ్‌లో విహరించవచ్చు. ఈ ప్రదేశం అన్ని వైపుల నుండి పర్వత శ్రేణులతో అందంగా ఉంటుంది. దేవదార్ చెట్లు, పచ్చదనం, లోయలు ఈ ప్రదేశానికి అందాన్ని ఇస్తాయి. మీరు ఇక్కడ కేబుల్ కార్ రైడ్ ను ఆనందించవచ్చు.

లేహ్ - జూన్‌లో సందర్శించడానికి లేహ్ చాలా మంచి ప్రదేశం. ఇక్కడ మౌంటెన్ బైకింగ్, మోటార్ సైకిల్ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయవచ్చు. లేహ్‌లో హెమిస్ నేషనల్ పార్క్ కూడా ఉంది. వన్యప్రాణులంటే ఇష్టపడేవారికి బెస్ట్ ప్లేస్ లేహ్ బాగా నచ్చుతుంది.

నైనిటాల్ - నైనిటాల్ చుట్టూ పైన్ చెట్లతో కూడిన చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ సరస్సులు, ఎత్తైన పర్వతాలు అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ నైని సరస్సు, టిఫిన్ టాప్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

తవాంగ్ - తవాంగ్ ఒక గొప్ప పర్యాటక ప్రదేశం. ఇక్కడి పవిత్ర పుణ్యక్షేత్రాలు, సహజ సౌందర్యం, అందాలను పర్యాటకులను ఆకర్షిస్తాయి. తవాంగ్ మొనాస్టరీ, వార్ మెమోరియల్ తవాంగ్, మాధురి సరస్సు ఇక్కడ ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు.





























