Health Tips: నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.? ఈ న్యాచురల్ టిప్స్‌ పాటిస్తే క్షణాల్లో నిద్రలోకి జారుకుంటారు

చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. మారుతోన్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా నిద్రలేమితో సతమతమవుతున్నారు. అయితే కొన్ని సహజమైన టిప్స్ పాటించడం ద్వారా నిద్రలేమి సమస్యకు చెక్‌ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటంటే..

Narender Vaitla

|

Updated on: May 21, 2023 | 12:42 PM

ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలో నిద్రలేమి కూడా ఒకటి. మారుతోన్న జీవన విధానం కారణంగా నిద్ర కూడా బంగారంలాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే కొన్ని టిప్స్‌ పాటించడం ద్వారా నిద్రలేమికి చెక్‌ పెట్టొచ్చు. అవేంటంటే..

1 / 5
 నిద్రకు ఉపక్రమించే గంట ముందు వేడి పాలు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంటనే నిద్రపడుతుంది. ఇక ప్రశాంతమైన నిద్రకు ఆయిల్ మసాజ్‌ మరొక మార్గం. ఆయిల్‌తో మసాజ్‌ చేసుకుంటే ప్రశాంతంగా మారుతుంది.

2 / 5
 రోజంతా ఎన్నో పనులు, ఒత్తిడితో సతమతమవ్వడం కూడా నిద్రలేమికి కారణంగా చెప్పొచ్చు. అందుకే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఇట్టే నిద్రలోకి జారుకోవచ్చు.

3 / 5
రాత్రి నిద్రించేకంటే 2 నుంచి 3 గంటల ముందే డిన్నర్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. తిన్న వెంటనే నిద్రపోతే కడుపులో ఉండే యాసిడ్ ఛాతీలో మంటను కలిగిస్తుంది, ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.

4 / 5
రాత్రి పడుకునే ముందు నికోటిన్, కెఫిన్, ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి. అలాగే నిద్రపోయే ముందు ఫోన్‌ వాడకాన్ని కూడా వీలైనంత తగ్గించాలి.

5 / 5
Follow us