- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in telugu To be successful never share these things with anyone in life
Chanakya Niti: సక్సెస్ మీ సొంతం కావాలంటే.. జీవితంలో ఈ విషయాలు గోప్యత పాటించమన్న చాణక్య
ఆచార్య చాణక్యుడు తన విధానాలలో జీవితంలోని కొన్ని అంశాలలో గోప్యత ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పాడు. జీవితంలో కొన్ని విషయాలు గోప్యంగా ఉంచాలని తెలిపాడు. ఆచార్య చాణక్యుడు ఏయే విషయాలను తన విధానాలలో రహస్యంగా ఉంచడం గురించి మాట్లాడాడో తెలుసుకుందాం.
Updated on: May 21, 2023 | 11:44 AM

అసూయ: ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మీ పట్ల అసూయపడే వ్యక్తి నుండి ఎల్లప్పుడూ దూరం ఉండాలి. మీ విజయాలకు లేదా సంపద చూసి అసూయపడే .. లేదా కుళ్లుకునే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. వీరి స్నేహం ప్రతికూల భావోద్వేగాలను కలిగించవచ్చు. లేదా హానికలిగించవచ్చు. లేదా అల్లకల్లోలానికి దారి తీయవచ్చు. అంతేకాదు జీవితంలో కొన్ని మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నా అసూయ పరులు ఆ అవకాశాలను మీ దగ్గరకు చేరనివ్వకుండా చేస్తారు.

మూర్ఖులు: జ్ఞానం లేని వారి నుండి లేదా తమ జీవితానికి సంబంధించి చెడు నిర్ణయాలు తీసుకునే వారి నుండి దూరం ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ఇటువంటి వారు తీసుకునే పనుల వలన మీ స్వంత నిర్ణయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఒకొక్కసారి జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది.

మద్దతు, ప్రోత్సాహం: ఆచార్య చాణక్య ప్రకారం వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. వీరి మధ్య సంబంధం బలపడుతుంది. వ్యక్తిగత లక్ష్యాలు, ఆకాంక్షలను కొనసాగించడంలో జీవిత భాగస్వామి మద్దతు ప్రేరణ, ప్రోత్సాహం ఇస్తుంది. ఒకరు విజయం సాధిస్తే.. ఇద్దరూ కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి.

విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.

మూర్ఖులు: మూర్ఖులతో సహవాసం హానికరమని చాణక్యుడు వివరించాడు. వివేకం లేని వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు. మూర్ఖులు తీసుకునే చెడు నిర్ణయాలు మీపై ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో మీరు స్నేహం చేయండి.




