AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: వైష్ణవి టెంపుల్, హరిద్వార్ సహా ఉత్తర భారతంలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను తక్కువ ధరకే అందిస్తోన్న IRCTC.. పూర్తి వివరాలు

ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చు.

IRCTC Tour: వైష్ణవి టెంపుల్, హరిద్వార్ సహా ఉత్తర భారతంలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను తక్కువ ధరకే అందిస్తోన్న IRCTC.. పూర్తి వివరాలు
Bharat Gaurav Train
Surya Kala
|

Updated on: May 19, 2023 | 9:32 AM

Share

దేశంలోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించే వీలుని కల్పిస్తూ..  దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అనేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. భారత్ గౌరవ్ రైలుకు 100 శాతం ప్రోత్సాహం..  సానుకూల స్పందన లభించడంతో, ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చు.

సికింద్రాబాద్ స్టేషన్ నుండి ప్రారంభమయ్యే భారత్ గౌరవ్ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ, మహారాష్ట్రలలో స్టాప్‌ల్లో బోర్డింగ్ / డి బోర్డింగ్ అందించనుంది. దక్షిణాది వారితో పాటు.. ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన యాత్రాస్థలాలు, చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తుంది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లు ఉండనుంది ఈ టూర్ ప్యాకేజీ. ఈ టూర్ లో  వైష్ణో దేవి ఆలయ దర్శనం చేసుకునే వీలు కల్పిస్తుంది. అయితే కత్రా నుండి ఆలయానికి పోనీ లేదా డోలీ లేదా హెలికాప్టర్ సర్వీస్ ద్వారా వెళ్లాలనుకునే పర్యాటకులు ఎవరికీ వారే సొంత ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది.

భారత్ గౌరవ్ రైలు టూర్ ప్యాకేజీలో ప్రయాణీకులకు వసతి, ఆహారం  అన్ని ప్రయాణ సౌకర్యాలు, వసతి, క్యాటరింగ్ ఏర్పాట్లను చేస్తుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు షెడ్యూల్ 

పర్యటనలో భాగంగా సాగే ప్రయాణం – సికింద్రాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభంకానుంది. ఆగ్రా, మధుర, బృందావన్ , కత్రా ,వైష్ణోదేవి,  హరిద్వార్, రిషికేశ్ మీదుగా సాగి తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటారు.

పర్యటన తేదీ – జూన్ 10 మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభం కానుంది.

పర్యటన వ్యవధి – ఎనిమిది రాత్రులు/తొమ్మిది రోజులు (జూన్ 10 నుండి 18 వరకు) ఉండనుంది.

బోర్డింగ్ / డి బోర్డింగ్ స్టేషన్లు: సికింద్రాబాద్, కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, సిర్పుర్కాగజ్ నగర్, బల్హర్షా, వార్ధా, నాగ్పూర్.

ప్యాకేజీ ధరలు

ఎకానమీ కేటగిరీ (స్లీపర్ క్లాస్ ): రూ. 15,435.

థర్డ్ ఏసీ  (3AC): రూ. 24,735.

కంఫర్ట్ కేటగిరీ (ఏసీ టూ టైర్ 2AC): రూ. 32,480.

ఈ టూర్ ప్యాకేజీ మరిన్ని వివరాల కోసం, ఎవరైనా IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు: http://www.irctctourism.com లేదా సంప్రదించండి – 9701360701 లేదా 8287932228 లేదా 9110712752 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..