IRCTC Tour: కర్ణాటకలో అందమైన ప్రదేశాలను చూడాలనుకుంటున్నారా.. ఐఆర్‌సీటీసీ అందిస్తోన్న ప్యాకేజీ వివరాలు మీకోసం
హైదరాబాద్ నుండి కర్ణాటకకు వెళ్లే ప్రయాణికుల కోసం 'కోస్టల్ కర్ణాటక' పేరుతో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలను సందర్శించడానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ కోస్టల్ కర్ణాటక ప్యాకేజీ మే నుంచి అందుబాటులోకి వచ్చింది.
వేసవి వినోదం కోసం అందమైన ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునేవారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుండి కర్ణాటకకు వెళ్లే ప్రయాణికుల కోసం ‘కోస్టల్ కర్ణాటక’ పేరుతో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలను సందర్శించడానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ కోస్టల్ కర్ణాటక ప్యాకేజీ మే నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా ట్రైన్ ప్రతి మంగళవారం అందుబాటులో ఉండనుంది. రైళ్లు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6:05 గంటలకు బయలుదేరుతాయి. ప్యాకేజీలో పూర్తి వివరాలు మీకోసం..
ప్యాకేజీ ధరలు ఎలా ఉంటాయంటే
ఈ కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ ధర ఆరు పగలు, 5 రాత్రులు ఉండనుంది. ప్యాకేజీలో భాగంగా స్టాండర్డ్ కేటగిరీ, 3ఎసి కోసం స్లీపర్ క్లాస్ లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్యాకేజీ ధరలు రూ. 11,600 నుండి రూ. 34,270 వరకు అందుబాటులో ఉండనున్నాయి.
ప్యాకేజీలో ఏఏ ప్రాంతాలు చూడవచ్చు అంటే
ఈ ప్యాకేజీలో మురుడేశ్వర్, మంగళూరు తీరం మీదుగా ST మేరీస్ ద్వీపం, మల్పే బీచ్, జోగ్ జలపాతం వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. శ్రీ కృష్ణ ఆలయం, శారదాంబ ఆలయం, మూకాంబిక ఆలయం, గోకర్ణలోని మురుడేశ్వర్ ఆలయం, కటీల్ ఆలయం , మంగళ దేవి ఆలయం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఈ ప్యాకేజీలో అందించనున్నారు.
ఈ ప్యాకేజీ ప్రయాణికులకు మూడు రాత్రుల వసతి, అల్పాహారం, ప్రయాణ బీమాతో సహా ఎయిర్ కండిషన్డ్ వాహనం వంటి ప్రధాన సౌకర్యాలను కూడా అందిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..