AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Health Benefits: వెండి పాత్రలో తింటే ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..? దీని వెనుక ఇంత విషయముందా..

రకరకాల వెండి నగలు మార్కెట్ లో దొరుకుతున్నాయి. వీటిని ధరించడం వల్ల నిస్సందేహంగా ఎవరికైనా క్లాసీ లుక్ వస్తుంది. అయితే ఆభరణాల తయారీకి ఉపయోగించే వెండి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా. ఆయుర్వేదం ప్రకారం.. వెండి మన శరీరం నుండి అనేక వ్యాధులను దూరం చేస్తుంది.

Silver Health Benefits: వెండి పాత్రలో తింటే ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..? దీని వెనుక ఇంత విషయముందా..
Health Benefits Of Silver
Surya Kala
|

Updated on: Apr 27, 2023 | 12:37 PM

Share

భారతీయులు బంగారం తర్వాత ప్రాధాన్యత ఇచ్చే లోహం వెండి. ఈ వెండి లోహంతో పట్టీలు, కడియాలు, మెట్టెలు వంటివి తయారు చేసి ధరించేవారు. అంతేకాదు ఇంట్లో పూజకు ఉపయోగించే పాత్రల్లో ఎక్కువగా వెండితో తయారు చేసినవి ఉపయోగిస్తారు. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఇప్పుడు బంగారు నగలతో సమానంగా వెండి నగలకు ప్రాధాన్యత ఉంది. రకరకాల వెండి నగలు మార్కెట్ లో దొరుకుతున్నాయి. వీటిని ధరించడం వల్ల నిస్సందేహంగా ఎవరికైనా క్లాసీ లుక్ వస్తుంది. అయితే ఆభరణాల తయారీకి ఉపయోగించే వెండి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా. ఆయుర్వేదం ప్రకారం.. వెండి మన శరీరం నుండి అనేక వ్యాధులను దూరం చేస్తుంది. మత్స్య పురాణం ప్రకారం, వెండి శివుని మూడవ కన్ను నుండి ఉద్భవించిందని విశ్వాసం. వెండి మన ఆరోగ్య సమస్యలను నయం చేయడమే కాకుండా, గ్రంధాలలో దీనిని పవిత్ర లోహంగా పేర్కొన్నారు. వెండి పాత్రలలో దేవుడికి నైవేద్యాన్ని సమర్పించడానికి కారణం ఇదే.

ఒకప్పుడు రాజుల ఇళ్లలో బంగారం, వెండితో సహా లోహాలతో చేసిన పాత్రల్లోనే ఆహారం తీసుకునేవారు. అయినప్పటికీ, నేటికీ చాలా ఇళ్లలో వెండి పాత్రలు చాలా అరుదుగా ఉపయోగించబడుతున్నాయి. ఆయుర్వేదం ప్రకారం వెండిలో 100 శాతం బ్యాక్టీరియా ఉండదు. వెండి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

వైరస్, బ్యాక్టీరియా నుంచి రక్షణ పరిశోధన ప్రకారం వెండి యాంటీ బాక్టీరియల్ , యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంది. దీని  కారణంగా మన శరీరం  బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్ల నుంచి రక్షణ కలుగుతుంది. సిల్వర్ అయాన్లు శరీరంలోని బ్యాక్టీరియాపై దాడి చేస్తాయి. అయితే ఈ సిల్వర్ అయాన్లు.. వైరస్ ను ఏ విధంగా చంపుతుందో స్పష్టమైన రీజన్ తెలియాల్సి ఉంది. అంతేకాదు వెండి పాత్రలో తినే ఆహారం జలుబు, ఫ్లూ నుంచి రక్షణ ఇస్తుంది. వ్యాధి కారక వైరస్ లపై పోరాడుతుంది.

ఇవి కూడా చదవండి

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం

వ్యాధి కారక వైరస్ తో పోరాడమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే తెల్ల రక్త కణాలు, రసాయనాలు, ప్రోటీన్లను ఇస్తుంది. వెండి ఆ రసాయన మూలకాలలో ఒకటి. దీని కారణంగా శరీరం రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు.

మానసిక వ్యాధి నివారణలో మేలు చేస్తుంది కంటి వ్యాధులు, అసిడిటీ, శరీరక చికాకులను తొలగించడంలో వెండి సహాయపడుతుంది. వెండితో చేసిన పాత్రలను ఉపయోగించడం వల్ల మానసిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు  శరీరంలో చక్కెర స్థాయి కూడా సాధారణ స్థాయిలో ఉంచుతుంది. మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెండికి మన మనసుకు కూడా సంబంధం ఉంది. అందుకే చిన్న పిల్లల మనసును తెలివి తేటలు పెంచేలా వెండి పాత్రలో ఆహారం లేదా నీరు ఇస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!