- Telugu News Photo Gallery Summer vacation 2023 include these south india hill station in your list for summer holidays
Summer Vacation 2023: వేసవి వినోదం కోసం దక్షిణాదిలో ఈ హిల్ స్టేషన్స్ బెస్ట్ ఎంపిక.. ఓ లుక్ వేయండి మరి
వేసవి సెలవుల్లో చాలా మంది పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఏదైనా ప్రాంతానికి వెళ్లాలని జాలీగా గడపాలని ప్లాన్ చేస్తారు. వేసవి వినోదంగా ఎండ వేడినుంచి రక్షణ ఇస్తూ.. ప్రకృతి అందాలతో అలరించే ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలని కోరుకుంటారు. అటువంటి వారి కోసం దక్షిణ భారతదేశంలోని కొన్ని అందమైన హిల్ స్టేషన్లు బెస్ట్ ఎంపిక. ఈ ప్రదేశాలు వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి ఉత్తమమైనవి.
Updated on: Apr 27, 2023 | 11:43 AM

వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే దక్షిణ భారతదేశంలోని కొన్ని ఉత్తమ హిల్ స్టేషన్ల గురించి తెలుసుకోండి. మీరు ఈ ప్రదేశాలలో పర్యటిస్తే వేసవి సెలవులను కూడా గుర్తుండిపోయేలా చేసుకోవచ్చు.

ఊటీ - తమిళనాడులో ఉన్న ఊటీకి వెళ్ళవచ్చు. ఇక్కడి తేయాకు తోటల అందం మీ మనసును ఆకట్టుకుంటుంది. దీనితో పాటు టాయ్ ట్రైన్‌లో ప్రయాణించవచ్చు. పిల్లలు ఈ రైడ్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు.

కూర్గ్ - కర్ణాటకలో ఉన్న కూర్గ్ వెళ్ళవచ్చు. వేసవి సెలవుల్లో సందర్శించడానికి ఈ ప్లేస్ బెస్ట్ ఎంపిక. మీరు ఇక్కడ ట్రాకింగ్ , క్యాపింగ్ ఆనందించగలరు. అంతే కాకుండా ఇక్కడి కాఫీ తోటల్లో విహరింస్తే.. ఆ మజానే వేరు.

మున్నార్ - మున్నార్ కేరళలో ఉంది. మీరు ఇక్కడ టీ మ్యూజియం సందర్శించడానికి పిల్లలను తీసుకెళ్లవచ్చు. ఈ హిల్ స్టేషన్‌లో మీరు చాలా ప్రశాంతంగా గడపవచ్చు. పచ్చని, ప్రశాంత వాతావరణం మీ మనసును ఆకట్టుకుంటుంది

హార్సిలీ హిల్స్ - హార్సిలీ హిల్స్ ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక చిన్న .. చాలా అందమైన హిల్ స్టేషన్. ప్రకృతి ప్రేమికులు దీని సహజ సౌందర్యాన్ని ఇష్టపడతారు. ఇక్కడ అనేక రకాల సాహస కార్యకలాపాలను కూడా ఆస్వాదించవచ్చు. ఇందులో ట్రెక్కింగ్, రాపెల్లింగ్, క్లైంబింగ్ వంటి అనేక గేమ్స్ ఉన్నాయి.




