- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti apart from hard work control on tongue is also the reason behind success in telugu
Chanakya Niti: విజయం కావాలంటే కృషి ఒక్కటే కాదు.. అది కూడా ముఖ్యమంటున్న చాణక్య
ఆచార్య చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి గుణాలు అతని విజయానికి కారణం.. అదే విధంగా ఒక వ్యక్తి లోని లోపాలు అతని వైఫల్యానికి కారణం అవుతాయి. లోపాలు ఎక్కువగా ఉన్నవారికి విజయం లభించదు.
Updated on: Apr 27, 2023 | 1:08 PM


భర్త, భర్తలు ఇద్దరూ ఒకరినొకరు అబద్దాలు చెప్పుకుంటుంటే.. ఆ బంధంలో బీటలు ఏర్పడతాయి. ఒకొక్కసారి ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు. కనుక భార్య, భర్తల మధ్య ఏ సమస్య వచ్చినా ఒకరితోనొకరు మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు.

మూర్ఖులు: మూర్ఖులతో సహవాసం హానికరమని చాణక్యుడు వివరించాడు. వివేకం లేని వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు. మూర్ఖులు తీసుకునే చెడు నిర్ణయాలు మీపై ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో మీరు స్నేహం చేయండి.

విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.

ప్రేమ- ఆప్యాయత: పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తించేలా తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వరాదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. పిల్లలు తప్పు చేస్తే.. తల్లిదండ్రులు అప్పుడే వారిని మందలించాలి. వారికి తప్పు ఒప్పుల గురించి అర్థం చేసుకునేలా వివరించాలి.




