Fry Fish Rice: ఆదివారం స్పెషల్.. సింపుల్ అండ్ టేస్టీ ఫ్రై ఫిష్ రైస్ రెసిపీ.. మీకోసం..
చేపలతో కూర, పులుసు, ఫ్రై వంటి పదార్ధాలను మాత్రమే కాదు.. చికెన్ ఫ్రైడ్ రైస్ లా.. ఫిష్ ఫ్రై రైస్ ను ట్రై చేసి చూడండి. ఈ రైస్ ను పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు ఆదివారం స్పెషల్ గా ఫ్రై ఫిష్ రైస్ రెసిపీ మీకోసం
సండే వస్తే చాలు నాన్ వెజ్ ప్రియుల ఇంట్లో రకరకాల స్పెషల్ వంటకాలు రెడీ అవుతాయి. వేసవి కాలం వచ్చేసింది. దీంతో చాలామంది చికెన్, మటన్ లకు కొన్ని రోజులు సెలవు ఇచ్చి సీఫుడ్ వైపు దృష్టి సారిస్తారు. ముఖ్యంగా చేపలను ఇష్టంగా తింటారు. అయితే చేపలతో కూర, పులుసు, ఫ్రై వంటి పదార్ధాలను మాత్రమే కాదు.. చికెన్ ఫ్రైడ్ రైస్ లా.. ఫిష్ ఫ్రై రైస్ ను ట్రై చేసి చూడండి. ఈ రైస్ ను పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు ఆదివారం స్పెషల్ గా ఫ్రై ఫిష్ రైస్ రెసిపీ మీకోసం..
తయారీకి కావాల్సిన పదార్ధాలు:
బియ్యం- ఒక కప్పు
వెల్లుల్లి- చిన్న ముక్కలు
క్యారెట్ – ఒకటి తురుమినది
ఉల్లిపాయ- ఒకటి
పచ్చి మిర్చి – నిలుగా కట్ చేసినవి 3
మిరియాల పొడి
కరివేపాకు
కొత్తిమీర
నెయ్యి -తగినంత
ఉప్పు -తగినంత
ఉల్లికాడల – చిన్న ముక్కలు
జీడిపప్పు- 8
మ్యారినేట్ కోసం చేపలు ఫ్రై
చేప ముక్కలు – 1/4 కిలో
కారం – అర స్పూన్
గరం మసాలా – అర స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం
గరం మసాలా- అర స్పూన్
పసుపు -కొంచెం
నిమ్మ రసం కొంచెం
ఉప్పు రుచికి తగినంత
తయారీ విధానం: ముందుగా చేపలను శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. కడిగిన చేప ముక్కల్లో గరం మసాలా, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బియ్యం కడిగి నానబెట్టుకుని.. అన్నం వండుకుని ఉడికే సమయంలో కొంచెంనూనె వేసి అన్నం వండుకుని పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి కొంచెం నెయ్యి , నూనె వేసుకుని వేడి చేయాలి. అందులో వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. అనంతరం రెడీ చేసుకున్న చేప ముక్కలను బాణలిలో వేసుకుని వేయించండి. రెండు వైపులా చేపలు దోరగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
మళ్ళీ బాణలి తీసుకుని కొంచెం నెయ్యి వేసుకుని సన్నని ఉల్లిముక్కలు, పచ్చి మిర్చి, క్యారెట్ తురుము వేసి వేయించాలి. తర్వాత ఉల్లి కాడలు వేసి వేయించాలి. అనంతరం చల్లారబెట్టుకున్న అన్నం వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలిసి.. స్టవ్ ఆఫ్ చేయాలి. అనంతరం ఈ అన్నంలో రెడీ చేసుకున్న చేపలను వేసుకుని పైన నిమ్మరసం, కొత్తిమీర వేసుకుని కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఫిష్ ఫ్రై రైస్ రెడీ.. ఏదైనా సలాడ్ తో లేదా మంచి గ్రేవీ కూరతో కలిపి సర్వ్ చేయండి.. లొట్టలేసుకుని మరీ తింటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..