Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే, రాత్రి వేళ ఇవి తినండి చాలు..

ఉరుకులు పరుగుల జీవితంలో అందరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు.. కానీ ఇది చాలా మందికి సాధ్యం కావడంలేదు. అదే సమయంలో, బరువు పెరగడం వల్ల, మనం అనేక తీవ్రమైన వ్యాధులను కూడా ఎదుర్కోవలసి వస్తుంది.

Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే, రాత్రి వేళ ఇవి తినండి చాలు..
Weight Loss tips
Follow us

|

Updated on: Apr 30, 2023 | 9:56 AM

ఉరుకులు పరుగుల జీవితంలో అందరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు.. కానీ ఇది చాలా మందికి సాధ్యం కావడంలేదు. అదే సమయంలో, బరువు పెరగడం వల్ల, మనం అనేక తీవ్రమైన వ్యాధులను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. బరువు తగ్గడం విషయానికి వస్తే, ప్రజలు వ్యాయామం, ఆహారంపై దృష్టి పెడతారు. అయితే, అల్పాహారంతోపాటు.. భోజనం కూడా పోషకమైనదిగా ఉండాలి. కొవ్వు పదార్థాల జోలికి వెళ్లకూడదు. ముఖ్యంగా రాత్రివేళ చేసే భోజనం (డిన్నర్) తేలికగా ఉండాలి. రాత్రి భోజనం ఎల్లప్పుడూ నిద్రకు 3 గంటల ముందు చేయాలి, తద్వారా మీ నిద్ర పూర్తి అవుతుంది. అయితే డిన్నర్‌లో కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చన్న విషయం మీకు తెలుసా…? తెలియకపోతే.. ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి..

బరువు తగ్గడానికి వీటిని తినండి..

పెసరపప్పు: పెసరపప్పులో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మీ రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఇంకా బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. అందుకే డిన్నర్‌లో పప్పును భాగంచేసుకోవచ్చు. ఇంకా పెసరపప్పుతో చేసిన ఆహారాన్ని సైతం తీసుకోవచ్చు.

సగ్గుబియ్యం ఖిచ్డీ: సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. సాబుదాన ఖిచ్డీ మీరు ఉపవాస సమయంలో తినే తేలికపాటి ఆహారం. కానీ మీరు మీ రోజువారీ డిన్నర్‌లో సగ్గుబియ్యాన్ని తీసుకుంటే.. మీరు మీ బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

బొప్పాయి సలాడ్: బొప్పాయి మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా ఇది బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అందుకే రాత్రి భోజనంలో బొప్పాయి తినొచ్చు. దీన్ని తయారు చేయడానిక ఒక గిన్నెలో బొప్పాయి, క్యారెట్, దోసకాయ ముక్కలను వేయండి. ఇప్పుడు అందులో సోయాసాస్, రైస్ వెనిగర్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు వేయండి. ఈ విధంగా మీ బొప్పాయి సలాడ్ సిద్ధంగా చేసుకోని తినండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం..