- Telugu News Photo Gallery Vrindavan famous temple must visit these temples of vrindavan for immense peace Telugu News
ఈ సెలవుల్లో బృందావనం టూర్ ప్లాన్ చేసుకోండి..! అంతులేని మనశ్శాంతిని పొందుతారు..
శ్రీ కృష్ణుడి భక్తులకు ఇది గొప్ప ప్రదేశం. ఇక్కడ అనేక దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. బృందావన్‌లోని ఈ ఆలయాలను తప్పక సందర్శించండి. ఇక్కడ ఏర్పాటు చేసిన చిత్రాల కళాకృతి మీకు ఎంతగానో నచ్చుతుంది.
Updated on: May 10, 2023 | 11:19 AM

Vrindavan Famous Temple: సమ్మర్ వెకేషన్ కోసం మీరు ఆధ్యాత్మీక, అందమైన ప్రదేశాలను సందర్శించాలనుకుంటే మీరు బృందావనానికి కూడా వెళ్ళవచ్చు. శ్రీ కృష్ణుడి భక్తులకు ఇది గొప్ప ప్రదేశం. ఇక్కడ అనేక దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. బృందావన్‌లోని ఈ ఆలయాలను తప్పక సందర్శించండి.

Banke Bihari Temple : బృందావన్‌లోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఇక్కడికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు దర్శనం కోసం వస్తుంటారు. మీరు బృందావనం వెళుతున్నట్లయితే ఇక్కడ తప్పక సందర్శించండి. (ఫోటో క్రెడిట్: Instagram/banki_adaa)

Krishna Balarama Mandir: ఈ ఆలయాన్ని ఇస్కాన్ దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని 1975లో నిర్మించారు. ఈ ఆలయం శ్రీకృష్ణుడు , అతని సోదరుడు బలరాముడు కొలువైన క్షేత్రం. ఇక్కడ ఏర్పాటు చేసిన చిత్రాల కళాకృతి మీకు ఎంతగానో నచ్చుతుంది. (ఫోటో క్రెడిట్: Instagram / svasti_g.opinatha)

Rangji Temple : ఈ ఆలయం 1851లో నిర్మించబడింది. బృందావన్‌లోని అతిపెద్ద దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం రంగనాథునికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో మీరు దక్షిణ మరియు ఉత్తర శైలి నిర్మాణ సౌందర్యాన్ని ఆరాధించగలరు. (ఫోటో క్రెడిట్: Instagram/the_saxena_ji/)

Prem Temple Tourist Places: బృందావన్ లోని ప్రేమ్ మందిర్ ఇక్కడ అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం తెల్లని పాలరాతితో నిర్మించబడింది. ఇక్కడ గోవర్ధన్ పర్వత లీల, కృష్ణ లీల, అనేక ఇతర విషయాలు మిమల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.





























