AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Desi Cow: ఈ దేశీయ ఆవులను పెంచుకోండి.. మీ ఇంట్లో పాల నది ప్రవహిస్తుంది .. ఆర్ధికంగా లాభాలు కూడా

ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి ఆవు పేడ, గోమూత్రాన్ని కొనుగోలు చేస్తోంది. ప్రతిఫలంగా రైతులకు కోట్లాది రూపాయలు ఇస్తున్నారు. రైతు సోదరులు అధునాతన జాతి ఆవుల పెంపకాన్ని చేపడితే.. పాల ఉత్పత్తులను విక్రయించడంతో పాటు ఆవు పేడ, ఆవు మూత్రం అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. దేశీయ ఉత్తమమైన 3 జాతుల ఆవుల గురించి తెలుసుకుందాం.

Desi Cow: ఈ దేశీయ ఆవులను పెంచుకోండి.. మీ ఇంట్లో పాల నది ప్రవహిస్తుంది .. ఆర్ధికంగా లాభాలు కూడా
Agri Farming
Surya Kala
|

Updated on: May 18, 2023 | 10:54 AM

Share

భారతదేశంలో రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణను కూడా ప్రధాన వృత్తిగా స్వీకరిస్తారు. దేశంలో కోట్లాది మంది రైతుల జీవనోపాధి పశుపోషణతో ముడిపడి ఉంది. రైతులు నెయ్యి, పెరుగు, వెన్న, పాలు, మజ్జిగ అమ్మడం ద్వారా ఆర్ధిక స్వలంభన పొందుతారు. కొందరు బాగా సంపాదిస్తున్నారు. ఇంటి ఖర్చులకు పశువుల పెంపకంతో డబ్బులను సంపాదించే అన్నదాతకు ఏ జాతి ఆవులనుకొంగలు చేయాలి.. ఎలాంటి ఆవులను పెంచాలనేది పెద్ద సమస్య . మేలు జాతి ఆవుల పెంపకం ద్వారా ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయి. అయితే చాలామంది రైతులకు సీజన్, వాతావరణాన్ని బట్టి ఎక్కువ పాలు ఇవ్వడానికి ఏ జాతి ఆవులు మంచివో తెలియదు. ఈ రోజు మనం మేలు జాతి ఆవులు, అధికంగా పాలు ఇచ్చే దేశీయ ఆవుల గురించి తెలుసుకుందాం..

వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఆవుల పెంపకం కోసం రైతులకు సబ్సిడీ ఇస్తున్నాయి. ఇందుకోసం రైతులకు వేల రూపాయలు ఉచితంగా అందజేస్తున్నాయి. అదే సమయంలో.. అనేక రాష్ట్రాల్లో ఆవుల పెంపకం చేపడుతున్న రైతులకు ప్రోత్సాహక మొత్తాన్ని కూడా ఇస్తున్నారు.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి ఆవు పేడ, గోమూత్రాన్ని కొనుగోలు చేస్తోంది. ప్రతిఫలంగా రైతులకు కోట్లాది రూపాయలు ఇస్తున్నారు. రైతు సోదరులు అధునాతన జాతి ఆవుల పెంపకాన్ని చేపడితే.. పాల ఉత్పత్తులను విక్రయించడంతో పాటు ఆవు పేడ, ఆవు మూత్రం అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. దేశీయ ఉత్తమమైన 3 జాతుల ఆవుల గురించి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

గిరి ఆవు: గిరి ఆవు దేశీయ జాతి ఆవు. అధికంగా పాలు ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. దీని పాలు చాలా ఖరీదైనవి. ఈ జాతి ఆవులు గుజరాత్, మహారాష్ట్ర , రాజస్థాన్‌లలో కనిపిస్తాయి. అయిదు గిరి ఆవుల జన్మ ప్రదేశం గుజరాత్‌లోని గిర్ అడవులు. అందుకే దీనిని గిరి ఆవు అంటారు. ఈ ఆవు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ఆవు ప్రత్యేకత ఏమిటంటే అది వేడి వాతావరణాన్ని సులభంగా తట్టుకోగలదు. రోజూ 15 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తుంది. ఈ జాతికి చెందిన ఆవు స్వాతంత్య్రానికి పూర్వం బ్రెజిల్‌కు పంపబడింది. రైతు సోదరులు గిరి  ఆవును సంరక్షిస్తూ.. పెంపకం చేపడితే మంచి పాల ఉత్పత్తిని పొందవచ్చు. పాలు సహా.. పేద, మూత్రం  అమ్మి బాగా సంపాదించవచ్చు.

సాహివాల్ ఆవు: గిరి ఆవులు మాదిరిగానే సాహివాల్ కూడా దేశీయ ఆవు జాతి. ఈ జాతి ఆవు జన్మ ప్రదేశం పాకిస్తాన్. ఈ ఆవు శరీరం పొడవుగా, బలిష్టంగా ఉంటుంది. రోజూ 10 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తుంది. ఈ ఆవుని సంరక్షిస్తే.. పాలు ఇచ్చే సామర్థ్యం పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో సాహివాల్ ఆవును రైతులు పెంచుతున్నారు.

రెడ్ సింధీ ఆవు: ఈ జాతి ఆవు ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ఆవు మూలం పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్. అయితే ఈ రెడ్ సింధీ ఆవులను ప్రస్తుతం హర్యానా, పంజాబ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా పెంచుతున్నారు. ఈ ఆవు 12 నుండి 20 లీటర్ల పాలు ఇస్తుంది. రైతులు రెడ్ సింధీ ఆవు పెంపకం చేపడితే.. పాలు అమ్మడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..
జెన్ జీ యువతపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
జెన్ జీ యువతపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
40 ఏళ్లలోపే మెనోపాజ్.. అమ్మాయిలు కాస్త జాగ్రత్త! ఇవి తెలుసుకోండి
40 ఏళ్లలోపే మెనోపాజ్.. అమ్మాయిలు కాస్త జాగ్రత్త! ఇవి తెలుసుకోండి
వర్షాల కోసం సింహాచలంలో వరుణ జప యాగం..
వర్షాల కోసం సింహాచలంలో వరుణ జప యాగం..
ఈ ఒక్కలోపం ఉంటే ఎన్ని షాంపూలు వాడిన జుట్టు రాలుతూనే ఉంటుంది!
ఈ ఒక్కలోపం ఉంటే ఎన్ని షాంపూలు వాడిన జుట్టు రాలుతూనే ఉంటుంది!
డోర్‌మ్యాట్ నల్లగా మారి దుర్వాసన వస్తోందా?.. సింపుల్ హ్యాక్
డోర్‌మ్యాట్ నల్లగా మారి దుర్వాసన వస్తోందా?.. సింపుల్ హ్యాక్
వెంటనే బరువు తగ్గాలా?.. ఇవి తింటే కొవ్వు దానికదే మాయం!
వెంటనే బరువు తగ్గాలా?.. ఇవి తింటే కొవ్వు దానికదే మాయం!