Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken with Curd: చికెన్‌ను పెరుగుతో మ్యారినేట్ చేయడం వల్ల విషంగా మారుతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..

ప్రపంచవ్యాప్తంగా చికెన్‌ని రకరకాలుగా మెరినేట్ చేస్తారు. అయితే ఈ రోజు మనం మాట్లాడుకుందాం పెరుగు వేసి చికెన్‌ని మెరినేట్ చేయడం సరైనదా కాదా? దీనిపై వంటల నిపుణులు, ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Chicken with Curd: చికెన్‌ను పెరుగుతో మ్యారినేట్ చేయడం వల్ల విషంగా మారుతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..
Marinate Chicken With Curd
Follow us
Sanjay Kasula

|

Updated on: May 22, 2023 | 4:43 PM

ప్రపంచవ్యాప్తంగా చికెన్‌ను వివిధ పద్దతుల్లో తయారు చేస్తారు లేదా ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. కొంతమంది చికెన్‌ని నిమ్మకాయ రసం, ఉప్పు వేసి మెరినేట్ చేస్తారు. మరికొందరు పెరుగు, నిమ్మరసం కలిపి నిల్వ చేస్తారు. చికెన్‌లో ప్రోటీన్లు, అనేక రకాల పోషకాలు ఉంటాయి. మీరు దానిని సరిగ్గా నిల్వ చేస్తే.. మీరు దానిని చాలా రోజులు ఉపయోగించవచ్చు. దీన్ని తయారు చేయడం సులభం, అందుకే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. కానీ తరచుగా ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి వచ్చినప్పుడు.. ప్రజలు పొరపాటు చేస్తారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్‌డీఏ) విడుదల చేసిన రిపోర్టు ప్రకారం, చికెన్‌ను ఒకటి నుంచి రెండు రోజులు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు(ఈ లెక్క కేవలం చల్లగా ఉండే అమెరికాలో). ఉడికించిన చికెన్ లేదా మెరినేట్ చేసిన చికెన్ 3 నుంచి 4 రోజులు నిల్వ చేయవచ్చు.

వేసవి కాలంలో చికెన్‌ను నిల్వ ఉంచే సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మనం చికెన్‌ని ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటే అందులో బ్యాక్టీరియా పెరుగుదల ఆగిపోతుందని చాలా పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే చికెన్ ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. హెల్త్‌లైన్‌లో ప్రచురించిన వార్తల ప్రకారం, చికెన్‌ను 9 నెలల పాటు ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. మీరు ఎప్పుడైనా చికెన్ నిల్వ చేస్తే, అది గాలి చొరబడని కంటైనర్‌లో చేయాలి. మీరు చికెన్‌ను పెరుగులో కలిపి మెరినేట్ చేస్తుంటే.. మీరు దానిని 2-3 రోజులు సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు.

చికెన్‌ను పెరుగుతో మ్యారినేట్ చేయడం వల్ల విషంగా మారుతుందా..

చికెన్‌ని పెరుగుతో కలిపి మ్యారినేట్ చేయడం వల్ల ఎలాంటి హాని ఉండదు. ఇందుకు బదులుగా చాలా మంచిది.. దీనితో చికెన్ కర్రీ లేదా మరేదైనా రెసిపీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా నిల్వ చేయడానికి ఫ్రిజ్ ఉపయోగించుకోవచ్చు..

పెరుగు, చికెన్ కలిపి తినడం హానికరం కాదు

పెరుగులో కాల్షియం, విటమిన్ డి వంటి పోషక మూలకాలు పుష్కలంగా ఉంటాయి. కండరాలకు ఏది మంచిది. మరోవైపు, చికెన్‌లో చాలా ప్రోటీన్ ఉంటుంది. రెండూ కలిపి తినడం వల్ల ఎటువంటి హాని లేదు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం