Relationship Tips: ఆ సమయంలో స్త్రీలకు నొప్పి ఎందుకు వస్తుంది..? కారణాలు ఏంటంటే..!

దాంపత్య జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. పెళ్లాయిన స్త్రీలలో రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించేందుకు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భార్యాభర్తల కలయిక సమయంలో నొప్పి..

Relationship Tips: ఆ సమయంలో స్త్రీలకు నొప్పి ఎందుకు వస్తుంది..? కారణాలు ఏంటంటే..!
Relationship Tips
Follow us
Subhash Goud

|

Updated on: May 21, 2023 | 6:04 PM

దాంపత్య జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. పెళ్లాయిన స్త్రీలలో రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించేందుకు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భార్యాభర్తల కలయిక సమయంలో నొప్పి తలెత్తడం జరుగుతుంటుంది. పెళ్లాయిన కొత్తలో స్త్రీలకు ఇలా జరగడం సహజం. సాధారణంగా సంభోగానికి శరీరం సిద్ధం అయినప్పుడు ప్రైవేటు పార్ట్‌ నుంచి కొన్ని ద్రవాలు స్రవిస్తాయి. కానీ ఇవి సరిగ్గా ఊరకపోతే లూబ్రికేషన్‌ ఉండదు. ఆ ప్రైవేటు పార్ట్‌ భాగం పొడిగా ఉంటుంది. అలాంటి సమయంలో రతి జరిపితే నొప్పి వస్తుంటుందని స్త్రీవైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే సాధరాణంగా కొత్త పెళ్లాయిన వారిలో ప్రైవేటు పార్ట్‌ ఎక్కువగా రాపిడికి గురవుతుండటం వల్ల ఇలా జరుగుతుంటుందని చెబుతున్నారు. మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌లు కూడా వచ్చే అవకాశం ఉందని, అందుకే భార్యాభర్తలిద్దరూ దగ్గరలోని గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

పెండ్లయిన తొలి నాళ్లలో ఇద్దరిలో ఎవరికైనా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. అయితే మూత్రానికి వెళ్లిన సమయంలో మంటగా అనిపించడం, మూత్రం పదేపదే వచ్చినట్లు అనిపించడం సర్వసాధారణం. దీనిని హనీమూన్‌ సైస్టెటిస్‌ అంటారు. కలయిక సమయంలో వాడేందుకు లూబ్రికేషన్‌ ఆయింట్‌మెంట్‌లు వాడాలని వైద్యులు సూచిస్తారు. వాటిని కూడా వాడవచ్చు. ఈ విషయమై మహిళలు భర్తతో చర్చించడం మంచిదంటున్నారు. సమస్య తగ్గాలంటే భర్త సహకారం తప్పనిసరి అని, ఇలాంటి సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి