Recharge Plan: రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులే ఎందుకు? టెలికాం కంపెనీల మాయ తెలిస్తే అవాక్కవుతారు..!
గతంలో టెలికాం కంపెనీలు తమ కస్టమర్ల సౌకర్యార్థం 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌లను తీసుకొచ్చేవి. అయితే ఇప్పుడు ప్రతి టెలికాం కంపెనీ కేవలం 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ తోనే వస్తుంది. మరి ఇలా ఎందుకు ఇస్తున్నాయి? టెలికాం కంపెనీలు ఎందుకు ఇలా చేస్తున్నాయి? నెలలో 30, 31 రోజులు ఉన్నప్పుడు, రీఛార్జ్ ప్లాన్ కేవలం 28 రోజులు మాత్రమే ఎందుకు?
గతంలో టెలికాం కంపెనీలు తమ కస్టమర్ల సౌకర్యార్థం 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌లను తీసుకొచ్చేవి. అయితే ఇప్పుడు ప్రతి టెలికాం కంపెనీ కేవలం 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ తోనే వస్తుంది. మరి ఇలా ఎందుకు ఇస్తున్నాయి? టెలికాం కంపెనీలు ఎందుకు ఇలా చేస్తున్నాయి? నెలలో 30, 31 రోజులు ఉన్నప్పుడు, రీఛార్జ్ ప్లాన్ కేవలం 28 రోజులు మాత్రమే ఎందుకు? ఇందులో ఉన్న మతలబు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సిందే..
టెలికాం కంపెనీలు తమ కస్టమర్లకు నెల వ్యాలిడిటీని 30 రోజులకు బదులుగా 28 రోజులకు, 2 నెలల వ్యాలిడిటీని 60కి బదులుగా 56 రోజులకు, 3 నెలల ప్లాన్ తీసుకుంటే 90కి బదులుగా 84 రోజుల చెల్లుబాటు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా టెలికాం కంపెనీలు ప్రతి ప్లాన్‌లో రోజులను తగ్గిస్తాయి. ఇది వినియోగదారుడిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఏడాదిలో కేవలం 12 సార్లు మాత్రమే రీచార్జ్ చేయాల్సిన కస్టమర్.. దీనివల్ల 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది.
కస్టమర్లకు లాస్.. కంపెనీలకు బెనిఫిట్..
ఈ ప్లాన్స్ వల్ల టెలికాం కంపెనీలు చాలా ప్రయోజనాలను పొందుతాయి. సంవత్సరంలో ప్రతి నెల నుండి 2 నుండి 3 రోజులు తగ్గించడం ద్వారా.. నెల రీచార్జ్‌ని ఎక్కువ పొందుతారు. వాస్తవానికి టెలికాం కంపెనీలు 12 నెలల ప్రయోజనాన్ని తీసుకోవాలి. కానీ, కస్టమర్ల 13 నెలల రీచార్జ్ చేయాల్సి వస్తోంది. ఈ ప్లాన్స్ ద్వారా అదనపు నెల రీచార్జ్ ఇన్‌కమ్‌ను కంపెనీలు పొందుతున్నాయి.
30 రోజుల ప్లాన్‌ను అందించే ఏకైక సంస్థ BSNL..
అన్ని టెలికాం కంపెనీలు ఇప్పుడు తమ వినియోగదారులకు 28 రోజుల ప్లాన్‌లను అందజేస్తున్నాయి. కానీ ప్రభుత్వం టెలికాం సంస్థ BSNL మాత్రం తన వినియోగదారులకు 30 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌ను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు.. 30 రోజుల చెల్లుబాటుతో ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..