Srikakulam: వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు.. జగన్ ముద్దు.. కిరణ్ వద్దు.. అంటూ అసమ్మతి నాయకులు నినాదాలు

ఎచ్చెర్ల అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి శ్రీకాకుళం పి.ఎన్.కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో సమావేశమైంది ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం. జగన్ ముద్దు.. కిరణ్ వద్దు.. అంటూ అసమ్మతి నాయకులు నినాదాలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

Srikakulam: వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు.. జగన్ ముద్దు.. కిరణ్ వద్దు.. అంటూ అసమ్మతి నాయకులు నినాదాలు
Srikakulam Ycp
Follow us

|

Updated on: May 22, 2023 | 6:52 AM

ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాత్రమే కాదు.. అధికార పార్టీ నేతల మధ్య కూడా వర్గ పోరు ఓ రేంజ్ లో కొనసాగుతుంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వైసీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌పై సొంత పార్టీలోనే అసమ్మతిగళం వినిపిస్తోంది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా రోడ్డెక్కటం అధికారపార్టీలో హీట్‌ పెంచుతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా శ్రీకాకుళం. అలాంటి జిల్లాలో వర్గ విభేదాలు అధికార పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఎచ్చెర్లలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ను సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఎచ్చెర్లలో ఏకంగా భారీ ర్యాలీచే చేపట్టారు వైసీపీ అసమ్మతి నేతలు.

ఎచ్చెర్ల అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి శ్రీకాకుళం పి.ఎన్.కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో సమావేశమైంది ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం. జగన్ ముద్దు.. కిరణ్ వద్దు.. అంటూ అసమ్మతి నాయకులు నినాదాలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. అవినీతి ఎమ్మెల్యేను రానున్న ఎన్నికల్లో గద్దె దింపుతామని శపథం చేశారు. అయితే.. ఎచ్చెర్లలోని NH 16 వద్దకు వచ్చేసరికి ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. నాయకులు, పోలీసులకు మధ్య వాదనలు కొససాగుతుండగానే వాహన ర్యాలీ ముందుకు సాగిపోయింది. ఈ క్రమంలో పోలీసులు వెంబడించి మరీ కొన్ని వాహనాలను పోలీస్ స్టేషన్‌ తరలించారు. ర్యాలీ అనంతరం శ్రీకాకుళం పి.ఎన్. కాలనీలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అసమ్మతి నాయకులు సమావేశం అయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు.

రానున్న ఎన్నికల్లో గొర్లె కిరణ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి సమావేశం ద్వారా అధిష్టానాన్ని కోరారు అధికార పార్టీ నేతలు. ఒకవేళ కిరణ్‌కి టికెట్ ఇస్తే ఓడిస్తామని కూడా హెచ్చరించడం వైసీపీలో కాకరేపుతోంది. ఇక.. ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కి వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో ఎచ్చెర్ల వైస్ ఎంపీపీ జరుగుబిల్లి శంకర్, మాజీ ఎంపీపీ బల్లాడ జనార్ధన్‌లతోపాటు నియోజకవర్గంలోని పలువురు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles