AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Currency: టీ షాప్‌లో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్.. యూ ట్యూబ్ వీడియోల చూసి దొంగ నోట్ల ముద్రిస్తున్న యువకుడు అరెస్ట్..

అడ్డదారిలో డబ్బు సంపాదన కోసం కొందరు కేటుగాళ్లు ప్రింటింగ్‌ మిషన్లనే క్యాష్‌ కార్ఖానాలుగా మార్చేస్తున్నారు. జనం కళ్లు గప్పి నకిలీనోట్లను మార్చుతున్న గ్యాంగ్‌ లీడర్‌ను చిత్తూరులో పట్టుకున్నారు పోలీసులు. విచారిస్తే అసలు బండారం బయట పడింది. 

Fake Currency: టీ షాప్‌లో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్.. యూ ట్యూబ్ వీడియోల చూసి దొంగ నోట్ల ముద్రిస్తున్న యువకుడు అరెస్ట్..
Palamaner Tea Vendor
Surya Kala
|

Updated on: May 21, 2023 | 7:43 AM

Share

సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొందరు తమ భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకుంటుంటే.. మరొకొందరు కంత్రీ పనులను చేయడానికి స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. యూట్యూబ్ ను చూసి దొంగ నోట్లను ముద్రించి అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనుకున్నాడు ఓ కరెన్సీ కన్నింగాడు. అడ్డదారిలో డబ్బు సంపాదన కోసం కొందరు కేటుగాళ్లు ప్రింటింగ్‌ మిషన్లనే క్యాష్‌ కార్ఖానాలుగా మార్చేస్తున్నారు. జనం కళ్లు గప్పి నకిలీనోట్లను మార్చుతున్న గ్యాంగ్‌ లీడర్‌ను చిత్తూరులో పట్టుకున్నారు పోలీసులు. విచారిస్తే అసలు బండారం బయట పడింది.

చిత్తూరు పలమనేరులో దొంగ నోట్ల ప్రింటింగ్‌సాగుతోంది. టీ కొట్టు కేంద్రంగానే కొన్నేళ్లుగా ముద్రిస్తున్న వ్యక్తి బండారం బయట పడింది. వీ కోట మండలం కే.కొత్తూరు గ్రామంలో ఇంటిలోనే దొంగ కరెన్సీ నోట్లను గోపాల్‌ అనే వ్యక్తి ముద్రిస్తున్నారని రహస్య సమాచారం అందింది పోలీసులకు. పక్కా స్కెచ్‌తో పోలీసులు దాడి చేసి గోపాల్‌ను పట్టుకున్నారు. అతని నుంచి 8200ల ఫేక్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

గ్రామాల్లో జరిగే వారంతపు సంతల్లోనే వీటిని మార్చే వాడు. గతంలో ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసిన అనుభవం యూ ట్యూబ్ వీడియోల సాయంతో దొంగ నోట్లు ముద్రణ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

కలర్ ప్రింటర్‌తో నోట్లు ప్రింట్ చేసి రద్దీ ప్రదేశాల్లో చిరు వ్యాపారులను మోసగిస్తున్నాడు. పలమనేరు కూరగాయల మార్కెట్ వ్యాపారుల ద్వారా ఫేక్ కరెన్సీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు. ఫేక్ నోట్ల టీ కొట్టు కేటుగాన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు పోలీసులు. ఈ కేటుగాడు సోషల్‌ మీడియాను స్ఫూర్తిగా తీసుకొని దొంగ నోట్లను ముద్రించడం మొదలు పెట్టాడంటున్నారు పలమనేరు డీఎస్పీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్