Mobile Recovery Mela: చోరీకి గురైన 1కోటి విలువైన మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేత..

ఫోన్లు పోవడం, చోరీకి గురికావడం.. పోయిన ఫోన్లు దొరక్కపోవడం కామన్‌.. ఫోన్ పోతే ఒకట్రెండు చోట్ల వెతుకుతాం.. దొరికిందా సరి.. లేకుంటే.. ఇక అంతే సంగతులు.. చోరీకి గురైందా.. అది మరీ కష్టం.. ఇలా ఆశలన్నీ వదులుకున్న వారి ఫోన్లను వెతికి మరీ ఇచ్చారు చిత్తూరు జిల్లా పోలీసులు. ఇంతకీ.. పోగొట్టుకున్న ఫోన్ల రికవరీ ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం..

Mobile Recovery Mela: చోరీకి గురైన 1కోటి విలువైన మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేత..
Police Recover Mobiles
Follow us

|

Updated on: May 21, 2023 | 7:04 AM

మొబైల్స్‌ పోగొట్టుకున్నబాధితులకు చిత్తూరు జిల్లా పోలీసులు గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఏకంగా.. 500 మొబైల్స్‌ను పోలీసులు రికవరీ చేశారు అంటే ఆశ్చర్యపోవాల్సిందే.. కదూ.. ఒకటి కాదు, రెండు కాదు.. ఐదు వందల ఫోన్లు.. అక్షరాల సుమారు కోటి విలువైన మొబైల్స్‌.. ఆధునిక టెక్నాలజీ సాయంతో ఫోన్ దొంగల ఆట కట్టించారు చిత్తూరు జిల్లా పోలీసులు.

మొబైల్స్‌ పోగొట్టుకున్నవారు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్‌తో చాట్‌బాట్‌ను రూపొందించారు చిత్తూరు పోలీసులు. చాట్‌బాట్‌లో ఫిర్యాదు చేసిన బాధితుల మొబైల్స్‌ రికవరీకి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చాట్‌బాట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు కొందరు బాధితులు.చాట్‌బాట్‌లో ఫిర్యాదు చేసిన బాధితుల మొబైల్స్‌ రికవరీకి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దాంతో.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, జమ్మూకశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఆధునిక టెక్నాలజీ ద్వారా మొబైల్ ఫోన్లను రాబట్టారు చిత్తూరు పోలీసులు. చోరికి గురైన కోటి రూపాయలు విలువైన 500 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. ఆ తర్వాత.. ఆ మొబైల్స్‌ను స్వయంగా బాధితులకు అందజేశారు ఎస్పీ రిషాంత్‌రెడ్డి. చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్‌లో మొబైల్ రికవరీ మేళా పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి మరీ బాధితులకు ఫోన్లు అప్పగించారు. చాట్ బాట్ లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లను కూడా గుర్తించి రికవరీ చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. మొబైల్ రికవరీలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను అభినందించారాయన.

ఎలాంటి కంప్లయింట్ లేకుండా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళకుండా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా.. ఇంట్లో కూర్చొని చాట్ బాట్ టెక్నాలజీతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను బాధితులు మళ్లీ పొందవచ్చంటున్నారు చిత్తూరు పోలీసులు. మొత్తంగా.. దొరకవనుకున్న ఫోన్లు మళ్ళీ కళ్ళ ముందు కనిపించేటప్పటికీ ఎగిరి గంతేశారు. పోగొట్టుకున్న మొబైల్స్‌ను తిరిగి అందజేయడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. అటు.. మొబైల్స్‌ రికవరీ చేసిన చిత్తూరు పోలీసులపై ఏపీ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా.. గతంలో మాదిరిగా.. ఫోన్‌ మిస్సింగ్‌పై ఫిర్యాదు తీసుకుని వదిలేయకుండా పోలీసులు రికవరీకి చర్యలు తీసుకోవడం బాధితులకు వరంగా మారుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..