Mystery Fire: ఆ గ్రామంలో వింత సమస్య.. ఆగని మంటలు..గంగమ్మ ఆగ్రహం అంటున్న గ్రామస్థులు..

గ్రామంలో మంత్రగాళ్ళ హడావుడి గంగమ్మను శాంతింపజేసేందుకు పొంగళ్ళు, పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు సీసీ కెమెరాల నిఘా బయట వ్యక్తులు రాకపోకలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  అయినా గ్రామంలో మంటలు మాత్రం ఆగడం లేదు.

Mystery Fire:  ఆ గ్రామంలో వింత సమస్య.. ఆగని మంటలు..గంగమ్మ ఆగ్రహం అంటున్న గ్రామస్థులు..
Mystary Fire In Village
Follow us
Surya Kala

|

Updated on: May 21, 2023 | 8:33 AM

ఆ గ్రామంలో మంటలు ఆగడం లేదు. ఎవరు నిప్పు పెడుతున్నారో తెలియడంలేదు. నిప్పు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అంతా మిస్టరీనే. గత రెండు వారాలుగా ఇదే చర్చ జరుగుతుంది. ఇదేదో మారుమూల గ్రామంలోనో.. అడవిలోనో జరుగుతున్నది కాదు. బాగా నాగరికతకు దగ్గరగా ఉన్న ఒక ఊరిలో జరుగుతోంది. ఇదే ఇప్పుడు అధికార యంత్రాంగానికి సవాలుగా మారింది. తలకు మించిన సమస్య అయ్యింది. తిరుపతి జిల్లాలోని ఓ గ్రామంలో ప్రజలు అకారణ మంటలకు భయభ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

చంద్రగిరి మండలంలోని ఒక గ్రామం శానంబట్ల. తిరుపతికి దాదాపు ఒక 15 కిలోమీటర్లు దూరంలో ఉండే గ్రామం. బాగా నాగరికత తెలిసిన గ్రామం. అయితే ఇప్పుడు అక్కడ మండుతున్న మంటలు అధికార యంత్రాంగానికి అంతుపట్టని సమస్యగా మారిపోయింది. గత రెండు వారాలుగా సవాలుగా మారింది. ఏకంగా జిల్లా యంత్రాంగమంతా దృష్టి సారించేంత సమస్యగా మారింది. జిల్లా కలెక్టర్ తో పాటు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా యంత్రాంగం పర్యటించారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అంతే కాదు గ్రామంలో మంత్రగాళ్ళ హడావుడి గంగమ్మను శాంతింపజేసేందుకు పొంగళ్ళు, పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు సీసీ కెమెరాల నిఘా బయట వ్యక్తులు రాకపోకలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  అయినా గ్రామంలో మంటలు మాత్రం ఆగడం లేదు.

రెండు వారాల క్రితం గ్రామంలో గడ్డివాములు తగలబడడం, హఠాత్తుగా బీరువాలో మంటలు చెలరేగడంతో ప్రారంభమైన వరుస మంటలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇళ్లల్లోని బీరువాల్లో బట్టలు కాలిపోతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. శానం బట్ల లోని ఒక వీధిలోనే ఇదంతా జరుగుతుండడం పై అధికార యంత్రాంగానికి కుడా అంతు పట్టడం లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియక పోతోంది. గ్రామంలోని నడివీధి గంగమ్మ వద్ద కర్పూరం వెలిగిస్తే చాలు ఎక్కడో ఒకచోట మంటలు చెలరేగుతాయని నమ్ముతున్న జనం మూఢనమ్మకంతో వణికిపోతున్నారు. దీంతో జనంలో భయం పోగొట్టేందుకు అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అసలు మంటలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

కెమికల్ రియాక్షన్స్ వల్ల జరుగుతోందా లేదా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మంటలు చెల్లరేగుతున్నాయన్న కోణంలో ఆరా తీస్తోంది. ఈ మేరకు ఇప్పటికే శాంపిల్స్ సేకరించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు కూడా పంపింది. ఇప్పటి వరకు నివేదిక రాకపోవడంతో మరోసారి శాంపిల్స్ సేకరించింది.

ఇదిలా ఉండగా జనంలో మూఢనమ్మకం భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్న అధికార యత్రాంగం జన విజ్ఞాన వేదిక ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఎస్వీ యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లను రంగంలోకి దింపింది. ఏకంగా జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే అధికార యంత్రాంగం అంతా గ్రామంలో పర్యటించి జనంలో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గ్రామంలో మంటలకు కారకులు ఎవరని తేల్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు  పోలీసు యంత్రాంగం లోతైన దర్యాప్తు చేస్తోంది. అనుమానితులందరినీ విచారించేందుకు కార్టన్ సెర్చ్ ను  నిర్వహించింది.

అయినా మంటల వెనక నిజాన్ని గుర్తించలేకపోయింది. జనంలో ఉన్న భయాన్ని పోగొట్టలేకపోయింది. అసలు పంటలు ఎందుకు వస్తున్నాయి, బీరువాల్లోని బట్టలు కాలిపోతున్నాయి అంటే వాడుతున్న సర్ఫ్, సోప్, వాటర్, కెమికల్స్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులను శానంబట్ల లో మోహరింప చేశారు. అసలు నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..