Operation Gaja Success: ఆపరేషన్ గజరాజు సక్సెస్.. రెండు మదపుటేనుగులను బంధించిన అటవీ శాఖ..

చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రజల్ని హడలెత్తించిన రెండు ఏనుగులను అటవీశాఖ సిబ్బంది బంధించింది. మత్తు మందు ఇచ్చి ఎట్టకేలకు రెండు ఏనుగులకు పట్టుకోవడంతో కుప్పం వాసులు ఊపిరి పీల్చుకున్నారు. 

Operation Gaja Success: ఆపరేషన్ గజరాజు సక్సెస్.. రెండు మదపుటేనుగులను బంధించిన అటవీ శాఖ..
Operation Gaja Success
Follow us
Surya Kala

|

Updated on: May 20, 2023 | 6:40 AM

తమిళనాడులోని కృష్ణగిరిలో రెండు వారాల క్రితం, కుప్పంలో గత వారం రోజులుగా బీభత్సం సృష్టించిన రెండు ఏనుగులను తమిళనాడు అటవీశాఖ సిబ్బంది బంధించారు. తిరుపత్తూరు సమీపంలోని ఏలగిరి హిల్స్‌లో ఏనుగుల ఆచూకీ లభించడంతో గన్ సాయంతో మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి రెండింటిని బంధించారు. తిరుపత్తూరు రూరల్ పరిధిలో రాకపోకలపై ఆంక్షలు విధించి ఏనుగులను అదుపులోకి తీసుకున్నారు తమిళనాడు అటవీశాఖ సిబ్బంది. ఆ తర్వాత.. రెండు ఏనుగులను విడదీసి తమిళనాడులోని హోసూరు రిజర్వ్ ఫారెస్ట్‌లో వేర్వేరు ప్రాంతాల్లో వదిలేశారు అటవీశాఖ సిబ్బంది.

ఇక.. ఈ రెండు ఏనుగులు.. గత 15 రోజుల్లో తమిళనాడులో ఐదుగురిని, ఏపీలో ఇద్దరిని బలి తీసుకున్నాయి. ఈ నెల 6న కుప్పం మండలం మల్లానురు వద్ద ఉషా, శివలింగం అనే ఇద్దరిపై దాడి చేసి చంపాయి. కొద్ది నెలల క్రితం ఒడిశా నుంచి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు కొంత కాలంగా చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తోంది. అయితే.. ఆ గుంపులోని నాలుగు ఏనుగులు కొద్ది రోజుల క్రితం కరెంట్‌ షాక్‌తో మృతి చెందగా.. మిగిలిన రెండు ఏనుగులు కుప్పంలోని తువ్వ కొండ వైపు వెళ్లిపోయాయి. దాంతో.. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు.. 10 రోజుల నుంచి ఎనిమల్ ట్రాకర్స్‌ ద్వారా ఏనుగులను బంధించేందుకు డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రెండు ఏనుగులు తిరుపత్తూరు సమీపంలోని పొలాల్లో ఉన్నాయన్న సమాచారంతో.. ప్రత్యేక బృందాలతో కలసి మత్తు మందు ఇచ్చి ఎట్టకేలకు బంధించారు. వారం రోజులుగా కంటి‌ మీద కునుకు లేకుండా చేసిన రెండు ఏనుగులను బంధించడంతో కుప్పం వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..