Kurnool: కొండరాయి పగిలిన 36 రోజుల తర్వాత చర్యలు మొదలు పెట్టిన అధికారులు.. సపోర్ట్‌గా రాడ్లు ఏర్పాటు

కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఎండ వేడికి బాహుబలి లాంటి కొండరాయికి పగుళ్లు వచ్చాయి. ఇది జరిగి నెలరోజులు గడిచిపోయింది. స్థానిక ఎస్సీ కాలనీ వాసులు ఇప్పటికి భయం గుప్పిట్లో నే జీవనం సాగిస్తున్నారు. పగుళ్లు వచ్చిన కొండరాయి ప్రస్తుతానికి ప్రమాదకరంగా మారింది.

Kurnool: కొండరాయి పగిలిన 36 రోజుల తర్వాత చర్యలు మొదలు పెట్టిన అధికారులు.. సపోర్ట్‌గా రాడ్లు ఏర్పాటు
Huge Stone Split
Follow us

|

Updated on: May 18, 2023 | 6:42 AM

ఎండ వేడిమికి ఇటీవల పగిలిన కొండ రాయిని అధికారులు మరోసారి పరిశీలించారు. నెలరోజులుగా భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్న ప్రజలకు భరోసా ఇచ్చారు. కొండరాయి తొలగించేందుకు చర్యలు చేపట్టారు. టీవీ9 ఇంపాక్ట్‌తో అధికారుల్లో కదలిక వచ్చింది. ఇటీవల కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఎండ వేడికి బాహుబలి లాంటి కొండరాయికి పగుళ్లు వచ్చాయి. ఇది జరిగి నెలరోజులు గడిచిపోయింది. స్థానిక ఎస్సీ కాలనీ వాసులు ఇప్పటికి భయం గుప్పిట్లో నే జీవనం సాగిస్తున్నారు. పగుళ్లు వచ్చిన కొండరాయి ప్రస్తుతానికి ప్రమాదకరంగా మారింది. ఆ కొండరాయితో నుంచి ఎప్పుడు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనని కంగారు పడుతున్నారు. భానుడి ప్రతాపానికి ఎలాంటి ప్రమాదం ఎదుర్కొవాల్సి వస్తుందోనని హడలిపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ ఎంతకాలం గడపాలని ఎస్సీ కాలనీవాసుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పాట్‌కు TV9 టీమ్‌ కూడా వెళ్లింది. కొండరాయితో ఎప్పటికైనా ప్రమాదమే అన్ని విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో చుట్టూరా కంచె ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాన్ని డేంజర్‌ జోన్‌గా ప్రకటించారు.

అయితే అధికారులు మళ్లీ అటు వెళ్లలేదు. ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో కొండరాయిని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇటీవల కాలనీవాసులు ఆందోళనకు దిగారు. కర్నూలు- బళ్లారి రహదారిపై ధర్నా చేపట్టారు. కొండరాయిని తొలగించని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు హామీ ఇచ్చి ఆ తర్వాత పత్తా లేకుండా పోయారన్నారు. ఈ కొండరాయి తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తుండటంతో ఎట్టకేలకు అధికారులు స్పందించారు. ఎస్సీ కాలనీ వాసుల ఆందోళనపై 36 రోజుల తరువాత స్థానిక అధికారులు స్పందించారు. సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆధ్వర్యంలో ఒంగోలు నుండి వచ్చిన మైనింగ్ ఎక్స్పక్ట్ బృందంతో కొండారాయిని పరిశీలించారు.

ఇవి కూడా చదవండి

ఈ కొండరాయికు ప్రస్తుతం సపోర్ట్‌గా రాడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఓవైపు నుండి కొండను చిన్నగా తొలగించనున్నారు. గ్రామస్తులు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..