Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘జగన్‌వి పచ్చి అబద్దాలు.. రేపో ఎల్లుండో అవినాశ్‌రెడ్డి అరెస్టు ఖాయం’.. టీడీపీ మినీ మహానాడులో అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు..

TDP Mini Mahanadu: శ్రీకాకుళంలో టీడీపీ మినీ మహానాడు జరిగింది. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాట్‌ కామెంట్స్ చేశారు. తనకు పేపర్ లేదు, టీవీ లేదంటూ జగన్‌ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, సాక్షి పేపర్, సాక్షి టీవీ తనవి కాదంటే..

‘జగన్‌వి పచ్చి అబద్దాలు.. రేపో ఎల్లుండో అవినాశ్‌రెడ్డి అరెస్టు ఖాయం’.. టీడీపీ మినీ మహానాడులో అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు..
Atchannaidu
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 18, 2023 | 5:45 AM

TDP Mini Mahanadu: శ్రీకాకుళంలో టీడీపీ మినీ మహానాడు జరిగింది. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాట్‌ కామెంట్స్ చేశారు. తనకు పేపర్ లేదు, టీవీ లేదంటూ జగన్‌ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, సాక్షి పేపర్, సాక్షి టీవీ తనవి కాదంటే.. ఉరి వేసుకొని చస్తానని ఛాలెంజ్‌ చేశారు. దేశంలోకెల్లా ధనవంతుడైన ముఖ్యమంత్రైన జగన్‌.. తాను పేదవాడినంటూ నంగనాచి కబుర్లు చెబుతున్నాడన్నారు. లేని రింగురోడ్డులో అవినీతి జరిగిందని కేసులు పెట్టి చంద్రబాబు ఉంటున్న ఇల్లు జప్తు చేస్తున్నాడని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసులో రేపో ఎల్లుండో అవినాశ్‌రెడ్డి అరెస్టు ఖాయమన్నారు. మేలో గాని జూన్‌లోగాని అసెంబ్లీని రద్దు చేసి డిసెంబర్లో ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారని, అయితే కర్నాటక ఫలితాలే ఏపీలో వస్తాయని ధీమా వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. ఇక శ్రీకాకుళం టీడీపీ మినీ మహానాడుకు పార్టీ సీనియర్లు అశోక్‌గజపతిరాజు, యనమల రామకృష్ణుడు ఇతర నేతలు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..