Sleeplessness: రాత్రివేళ నిద్రలేమి సమస్య వేధిస్తుందా..! ఈ జ్యూస్‌ తాగారంటే ప్రశాంతమైన నిద్ర తన్నుకోస్తుంది..

Sleep Disorders: పాటిస్తున్న ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రలేమి అనేది సర్వసాధారణ సమస్యగా మారింది. ఈ క్రమంలో కొందరికి అర్థరాత్రి దాటినా కూడా నిద్ర రాదు. ఈ నిద్రలేమి కారణంగా మరికొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అయితే నిద్రలేమికి చాలా కారణాలు..

Sleeplessness: రాత్రివేళ నిద్రలేమి సమస్య వేధిస్తుందా..! ఈ జ్యూస్‌ తాగారంటే ప్రశాంతమైన నిద్ర తన్నుకోస్తుంది..
Sleeplessness
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 17, 2023 | 6:20 AM

Sleep Disorders: పాటిస్తున్న ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రలేమి అనేది సర్వసాధారణ సమస్యగా మారింది. ఈ క్రమంలో కొందరికి అర్థరాత్రి దాటినా కూడా నిద్ర రాదు. ఈ నిద్రలేమి కారణంగా మరికొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అయితే నిద్రలేమికి చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. తినే ఆహారం ద్వారా కూడా నిద్రలేమి సమస్యన అధిగమించవచ్చు. అందువల్ల నిద్రలేమితో బాధపడేవారు కొన్ని రకాల ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అన్ని రకాల ఆహారాలను తిన్నా తినకపోయినా తప్పని సరిగా ద్రాక్ష రసం తాగాలని వారు అంటున్నారు. ఎందుకంటే.. నిద్రకు సహకరించే మెలటోనిన్ అనే హార్మోన్ ద్రాక్షలలో పుష్కలంగా ఉంటుందట. ఈ కారణంగా పడుకోవడానికి అరగంట ముందు ద్రాక్షను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చని వారు పేర్కొంటున్నారు.

ఆరోగ్య నిపుణులే కాక అనేక అధ్యయానాలు కూడా దీన్ని ధృవీకరించాయి. ద్రాక్షరసం తాగితే ప్రశాంతమైన నిద్ర ఖాయమని కొందరు అనుభవజ్ఞులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ద్రాక్షరసంతో పాటు గోరు వెచ్చని పాలు తాగినా కూడా కొంతమందికి నిద్ర వెంటనే పడుతుంది. అంతేకాక పాలకూరను కూడా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇదే కాక చెర్రీ పండ్లు, మజ్జిగ వంటివాటిని తీసుకోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్యను అధిగమించ్చని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి