YS Jagan: విజయవాడ ‘మహా పూర్ణాహుతి’లో సీఎం జగన్.. యాగం తర్వాత వేలాది మంది భక్తులకు అన్నదానం..
Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ రోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ మహా యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు..
Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ రోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ మహా యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగిస్తోన్న శ్రీమహాలక్ష్మీ యజ్ఞం.. ఏ ఇబ్బందులు లేకుండా ఐదు రోజులు నిర్విఘ్నంగా జరిగిందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో అందరి సమన్వయంతో యజ్ఞం జరిగిందన్నారు. ఎండను లెక్కజేయకుండా భక్తులు వచ్చారని తెలిపారు. ఇవాళ మహా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
నాలుగు ప్రధాన యాగశాలల్లో జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని తెలిపారు. ఉదయం గం.10:45కి సీఎం అభిషేక మండపానికి చేరుకుంటారని వెల్లడించారు. కంచి నుంచి తెచ్చిన వస్త్రాలను అమ్మవారికి జగన్ అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి స్వరూపానంద స్వామితో పాటు గణపతి సచ్చిదానంద స్వామి, మంత్రాలయ పీఠాధిపతి, అహోబిల జీయర్ స్వామి హాజరవుతారని తెలిపారు. అలాగే, చిన జీయర్ స్వామి వస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. భక్తులకు అన్న ప్రసాదం అందిస్తామన్నారు. ప్రకృతి సహకారంతో యజ్ఞం విజయవంతంగా జరిగిందని… ఇలాంటి యజ్ఞం భారత దేశంలో ఎక్కడా జరుగలేదన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
ఇక సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు అధికారులు అలర్ట్ అయ్యారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరతారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరతారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..