CPI Narayana: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ నారాయణ ఘాటూ వ్యాఖ్యలు.. భూస్వాములకు కోసమే ‘ధరణి’ అంటూ..
CPI Leaders: పల్లెపల్లెకు సీపీఐ-ప్రజల వద్దకు సీపీఐ పేరుతో నిర్వహించిన ప్రజాచైతన్యయాత్ర ముగింపు సభను హుస్నాబాద్ ఆర్టీసీ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు..
CPI Leaders: పల్లెపల్లెకు సీపీఐ-ప్రజల వద్దకు సీపీఐ పేరుతో నిర్వహించిన ప్రజాచైతన్యయాత్ర ముగింపు సభను హుస్నాబాద్ ఆర్టీసీ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్ పేరు పెట్టిన సచివాలయం ప్రజలు, ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉండాలి కానీ రాబందులకు అనుకూలంగా ఉండకూడదన్నారు. రాష్ట్రంలో సమస్యలను గాలికి వదిలేసి, మోదీపై పోరాడుతున్నామన్న సీఎం కేసీఆర్ వైఖరి సరికాదన్నారు నారాయణ. ముందు దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులను సమైక్యపరిచి, కార్యాచరణను రూపొందించాలన్నారు. మోదీ గడ్డం ఎంత పెరిగిందో, గ్యాస్ ధర అంతా పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం సామాన్యునికి భారంగా మారిందన్నారు. బిజెపి అండతోనే దేశంలో కుబేరులు నల్లదనాన్ని తెల్లదనంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు నారాయణ.
కేవలం కేరళలో ముగ్గురు మహిళలు కనిపించకుండా పోయిన ఘటనపై సినిమా తీయించిన మోదీ, గుజరాత్‌లో 46 వేల మంది కనిపించకుండాపోతే ఏం చేస్తున్నారని నారాయణ ప్రశ్నించారు. జీఎస్టీలో కార్పొరేట్ వాళ్లకు పన్నులు తగ్గించి, సామాన్యులు వాడే వస్తువులపై పన్నుల శాతాన్ని పెంచారన్నారు. ఇక తెలంగాణలో కేసీఆర్ పాలన నిజాం పాలన కంటే ఘోరంగా ఉందని ఎద్దేవా చేశారు. భూస్వాములకు న్యాయం చేయడానికే ‘ధరణి’ పోర్టల్ తీసకొచ్చారన్నారు నారాయణ. హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి బరిలోకి దిగుతారని ప్రకటించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..