The Kerala Story: భైంసాలో ది కేరళ స్టోరీ మూవీ ప్రదర్శన వివాదానికి తెర.. నేటి నుంచి 2 షో లకు అనుమతి
బైంసాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన హిందూ వాహిని నాయకులు పోలీసులకు సినిమా ప్రదర్శనపై విన్నవించడంతో వివాదం సద్దుమనిగింది. గత మూడు రోజులుగా సినిమా ప్రదర్శన పై రచ్చ జరుగుతూనే ఉంది.
నిర్మల్ జిల్లా భైంసా లో ది కేరళ స్టోరీ సినిమా పై విధించిన ఆంక్షలను సడలించారు. నేటి నుండి రోజు 2 షో లకు అనుమతినిచ్చారు. మార్నింగ్ ,మ్యాట్ని షో లకు మాత్రమే అనుమతిచ్చారు. వాస్తవానికి ది కేరళ స్టోరీ మూవీ శుక్రవారం నుంచి స్థానిక కమల థియేటర్‌లో చిత్ర ప్రదర్శన జరగాల్సి ఉంది. అయితే.. ఉదయం ఆట ఆరంభమయ్యే సమయానికి ముందు ప్రదర్శన నిలిపి వేయాల్సిందిగా థియేటర్ యాజమాన్యాన్ని ఆదేశించారు భైంసా పట్టణ పోలీసులు. దీంతో బైంసాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన హిందూ వాహిని నాయకులు పోలీసులకు సినిమా ప్రదర్శనపై విన్నవించడంతో వివాదం సద్దుమనిగింది. గత మూడు రోజులుగా సినిమా ప్రదర్శన పై రచ్చ జరుగుతూనే ఉంది. పోలీసులకు ఎట్టకేలకు రోజుకు రెండు షో లకు పర్మిషన్ ఇవ్వడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..