Back Pain Relief: వెన్ను నొప్పి వేధిస్తోందా..? ఖర్చు లేకుండానే తేలికగా చెక్ పెట్టేయండిలా..

Back Pain Relief: ప్రస్తుత కాలంలో వెన్ను నొప్పి స‌మ‌స్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇందుకు మారుతోన్న ప‌నిశైలి, ఎక్కువ సేపు కూర్చొని ప‌నిచేయ‌డమే కారణమని చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది వెన్ను నొప్పి వ‌చ్చిన‌..

Back Pain Relief: వెన్ను నొప్పి వేధిస్తోందా..? ఖర్చు లేకుండానే తేలికగా చెక్ పెట్టేయండిలా..
Remedies For Back Pain
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 15, 2023 | 7:50 AM

Back Pain Relief: ప్రస్తుత కాలంలో వెన్ను నొప్పి స‌మ‌స్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇందుకు మారుతోన్న ప‌నిశైలి, ఎక్కువ సేపు కూర్చొని ప‌నిచేయ‌డమే కారణమని చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది వెన్ను నొప్పి వ‌చ్చిన‌ ప్రతిసారి కూడా పెయిన్ కిల్ల‌ర్ టాబ్లెట్లు ఉపయోగిస్తుంటారు. చాలా మందికి తెలియన విషయం ఏమిటంటే పెయిన్ కిల్లర్స్ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి, అలాగే శాశ్వతమైన సైడ్ ఎఫెక్ట్స్‌ కలిగేలా చేస్తాయి. అందుకే పెయిన్ కిల్లర్స్‌కి బదులుగా కొన్ని రకాల చిట్కాలను అనుసరించడం ద్వారా వెన్ను నొప్పి నుంచి తేలికగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి వారు చెబుతున్న చిట్కాలేమిటో ఓ లుక్కేయండి..

  1. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కోసం ఆవ‌నూనెతో మ‌సాజ్ చేయ‌డం మంచిది. నొప్పి ఉన్న చోట కాస్త ఆవ‌నూనెతో మ‌ర్ద‌నా చేసి గోరు వెచ్చ‌ని నీటీతో స్నాం చేయాలి. ఇలా చేయడం ద్వారా అనతి కాలంలోనే వెన్ను నొప్పి శాశ్వతంగా దూరమవుతుంది.
  2. నొప్పి ఉన్న చోట హాట్ వాట‌ర్ బ్యాగ్‌తో కాప‌డం చేయడం ద్వారా కూడా వెన్ను నొప్పి త‌గ్గిపోతుంది.
  3. అంతేనా.. తీసుకునే ఆహారం ద్వారా కూడా ఒంటి నొప్పుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ప్ర‌తి రోజూ ఆహారంలో అల్లం ఉండేలా చూసుకుంటే ఎలాంటి నొప్పుల నుంచి అయినా బ‌య‌ట‌ప‌డొచ్చు.
  4. ఇంకా వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కోసం కొబ్బ‌రి నూనెలో క‌ర్పూరం వేసి దాన్ని నొప్పి ఉన్న చోట మ‌ర్ధ‌న చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి