Chikoti Praveen: రాజకీయాల్లోకి రాబోతున్న చీకోటి ప్రవీణ్.. త్వరలోనే ఏ పార్టీయో చెబుతానని వెల్లడి..
Chikoti Praveen: క్యాసినో దందాలో కింగ్ పిన్‌గా ప్రసిద్ధి పొందిన చికోటి ప్రవీణ్ కుమార్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు స్వయంగా ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసు గురించి, రానున్న కాలంలో..
Chikoti Praveen: క్యాసినో దందాలో కింగ్ పిన్‌గా ప్రసిద్ధి పొందిన చికోటి ప్రవీణ్ కుమార్ త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసు గురించి, రానున్న కాలంలో తన గమనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలతో తనకు సత్సంబంధాలు ఉన్నందునే కొందరు కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారని, వాటిల్లో వాస్తవం లేదన్నారు. ఇంకా రానున్న కాలంలో రాజకీయాల్లోకి వస్తానని, అయితే ఏ పార్టీలో చేరతానో త్వరలోనే ప్రకటిస్తానన్నారు.
‘థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో సోమవారం విచారణకు హాజరయ్యాను. ఒక ప్లేయర్‌గా మాత్రమే థాయిలాండ్ వెళ్ళాను. కానీ నకిలీ సర్టిఫికెట్స్‌తో నాకు ఇన్విటేషన్ పెట్టారు. అది తెలుసుకొని అక్కడ ఉన్న న్యాయస్థానం మాకు 2000 బాత్(థాయ్‌లాండ్ కరెన్సీ)లు ఫైన్ విధించింది. ఫైన్ కట్టి బయటకు వచ్చాము. టీడీపీ నేత పట్టాభితో పాటు కొందరు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదు. వైసీపీ నేతలు కొందరితో.. నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈ ఆరోపణలు వస్తున్నాయి. పట్టాభికి అధికారం లేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు’ అని చికోటి వ్యాఖ్యానించారు.
అలాగే తన ‘లగ్జరీ కార్ల కొనుగోలు అంశం ప్రస్తుతం ఐటి పరిధిలో ఉంది. ఈడీ 7 గంటల పాటు ప్రశ్నించింది. ప్రశ్నలకు సమాధానం చెప్పాను. త్వరలో రాజకీయ అరగేట్రం చేస్తాను. ఆ విషయం తెలిసే కొందరు నాపై పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు. ఏ పార్టీలో చేరతాను అనేది త్వరలో ప్రకటిస్తాను. నేను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే.. కొందరిలో భయం మొదలైంది. ఈడీ విచారణకి సహకరించాను. మళ్ళీ ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటాను’ అని పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి