Andhra Pradesh: రాష్ట్రంలో కాదు.. దేశంలోనే చారిత్రాత్మకమైనది: మంత్రి విడుదల రజని
రాష్ట్రంలో కాదు.. దేశంలోనే చారిత్రాత్మకమైనది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని వ్యాఖ్యానించారు ఏపీ హెల్త్ మినిస్టర్ విడుదల రజని. ఇది ఈ రాష్ట్రానికి దక్కిన మహర్దశగా పేర్కొన్నారు మంత్రి. జగనన్న నాయకత్వంలో ప్రతిఇంటా ఆరోగ్యం వెల్లివిరియాలనే ఓ ధృఢ సంకల్పంతో....
రాష్ట్రంలో కాదు.. దేశంలోనే చారిత్రాత్మకమైనది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని వ్యాఖ్యానించారు ఏపీ హెల్త్ మినిస్టర్ విడుదల రజని. ఇది ఈ రాష్ట్రానికి దక్కిన మహర్దశగా పేర్కొన్నారు మంత్రి. జగనన్న నాయకత్వంలో ప్రతిఇంటా ఆరోగ్యం వెల్లివిరియాలనే ఓ ధృఢ సంకల్పంతో.. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు మంత్రి విడుదల రజని. పల్నాడు జిల్లాలోని పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి, కార్యక్రమం అమలుతీరుని పరిశీలించారు.
నెల రోజుల క్రితం ఆరంభమైన ఈ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా 1 కోటి, 19 వేల మంది ప్రజలు ఓపీ సేవలు వినియోగించుకున్నారన్నారు. రోజుకి 90 వేల మందికి పైగా సేవలు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుతున్నాయని.. ఈ కార్యక్రమం దేశానికే తలమానికంగా నిలుస్తుందన్నారు మంత్రి.
పల్నాడు జిల్లాలో నాదెండ్ల మండలం తూబాడు తదితర గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, ఫ్యామిలీ డాక్టర్లు వచ్చి వెళ్ళారా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు మంత్రి. మంచానికే పరిమితమైన పేషెంట్‌ల ఇళ్ళకు వెళ్ళిన మంత్రి.. వైద్యుడు వచ్చి వెళ్ళాడా లేదా అని రోగి బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో భాగంగా వైద్యుల సేవలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు రోగి బంధువులు.
అంగన్ వాడి పాఠశాలలను సైతం తనిఖీ చేసిన మంత్రి.. వైఎస్సార్ సంపూర్ణ పోషణలో భాగంగా ఏమేమి అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు స్వయంగా ఐరన్ సిరప్ వేశారు. మరోవైపు గర్భిణీ స్త్రీలను పరామర్శించారు మంత్రి. గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితిని రిజిష్టర్ అడిగిన తెలుసుకున్నారు మంత్రి. సరిగ్గా స్పందించని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి. రోగికి సంబంధించిన ప్రతి వివరాన్నీ తప్పనిసరిగా రిజిష్టర్లో రాయాలని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి